హెచ్ఐవీ పరిశోధకురాలు గీతా రామ్‌జీ కరోనాతో మృతి

వాక్సిన్ శాస్త్రవేత్త, హెచ్ఐవీపై పరిశోధనలు చేసిన ప్రముఖ ప్రొఫెసర్ గీతా రామ్‌జీ కరోనా వైరస్ లక్షణాలతో మరణించారు. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన 50 ఏళ్ల గీత గత కొన్నేండ్లుగా వైరాలజీకి సంబంధించిన పరిశోధనలు చేస్తున్నారు. కాగా, ఆమె కరోనా వైరస్ కారణంగా మరణించినట్లు అధికారులు ప్రకటించారు. గత వారం లండన్ నుంచి దక్షిణాఫ్రికాకు చేరుకున్న ఆమె అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆమెకు కోవిడ్ 19కు సంబంధించిన లక్షణాలు కనపడ్డాయి. దీంతో అప్రమత్తమైన వైద్యులు ఆమెకు […]

Advertisement
Update: 2020-04-01 01:46 GMT

వాక్సిన్ శాస్త్రవేత్త, హెచ్ఐవీపై పరిశోధనలు చేసిన ప్రముఖ ప్రొఫెసర్ గీతా రామ్‌జీ కరోనా వైరస్ లక్షణాలతో మరణించారు. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన 50 ఏళ్ల గీత గత కొన్నేండ్లుగా వైరాలజీకి సంబంధించిన పరిశోధనలు చేస్తున్నారు. కాగా, ఆమె కరోనా వైరస్ కారణంగా మరణించినట్లు అధికారులు ప్రకటించారు.

గత వారం లండన్ నుంచి దక్షిణాఫ్రికాకు చేరుకున్న ఆమె అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆమెకు కోవిడ్ 19కు సంబంధించిన లక్షణాలు కనపడ్డాయి. దీంతో అప్రమత్తమైన వైద్యులు ఆమెకు కరోనా చికిత్సను అందించారు. కాని వ్యాది తీవ్రత పెరిగి ఆమె కన్ను మూసినట్లు దక్షిణాఫ్రికా వైద్య పరిశోధనా మండలి పేర్కొంది. గీతా రామ్‌జీ మరణం తమను ఎంతగానో కలచి వేసిందని ఆ ప్రకటనలో అధ్యక్షుడు గ్లెండా గ్రే పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు కరోనా కారణంగా ఐదు మరణాలు సంభవించగా.. భారత సంతతి వ్యక్తి కేసు ఇదే మొదటిది. ఇప్పటి వరకు ఆ దేశంలో 1350 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 21 రోజుల లాక్‌డౌన్‌లో ఉంది.

Tags:    
Advertisement

Similar News