అమెరికన్ బ్లాక్ థండర్ కు కరోనా టెన్షన్

దగ్గంటే భయం, తుమ్ములంటే హడల్ అమెరికన్ బ్లాక్ థండర్, గ్రాండ్ స్లామ్ టెన్నిస్ క్వీన్ సెరెనా విలియమ్స్ కు…కరోనా వైరస్ భయంతో కంటిమీద కునుకులేకుండా పోతోంది. రెండేళ్ల కుమార్తె ఒలింపియాకు కరోనా ఎక్కడ సోకుతుందోనని ముందుకు ముందే భయపడిపోతోంది. గత కొద్దిరోజులుగా స్వీయ క్వారెంటైయిన్ పాటిస్తోంది. సాధ్యమైనంత వరకూ జనానికి దూరంగా ఉంటూ వస్తోంది. తనకు సమీపంలో ఉన్నవారు ఎవరైనా దగ్గినా, తుమ్మినా తెగభయపడిపోతోంది. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. చివరకు తన గారాలపట్టి ఒలింపియా సైతం.. దగ్గినా, తుమ్మినా […]

Advertisement
Update: 2020-03-22 21:08 GMT
  • దగ్గంటే భయం, తుమ్ములంటే హడల్

అమెరికన్ బ్లాక్ థండర్, గ్రాండ్ స్లామ్ టెన్నిస్ క్వీన్ సెరెనా విలియమ్స్ కు…కరోనా వైరస్ భయంతో కంటిమీద కునుకులేకుండా పోతోంది. రెండేళ్ల కుమార్తె ఒలింపియాకు కరోనా ఎక్కడ సోకుతుందోనని ముందుకు ముందే భయపడిపోతోంది. గత కొద్దిరోజులుగా స్వీయ క్వారెంటైయిన్ పాటిస్తోంది. సాధ్యమైనంత వరకూ జనానికి దూరంగా ఉంటూ వస్తోంది.

తనకు సమీపంలో ఉన్నవారు ఎవరైనా దగ్గినా, తుమ్మినా తెగభయపడిపోతోంది. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. చివరకు తన గారాలపట్టి ఒలింపియా సైతం.. దగ్గినా, తుమ్మినా కలవరపడిపోతోంది.

కరోనా వైరస్ కు చికిత్స, మందు అంటూ ఏదీలేని కారణంగానే ఈ భయమంతా అని, అదే చికిత్స ఉంటే ఎంతవరకైనా పోరాడవచ్చునని చెబుతోంది. తనకెరియర్ లో ఇప్పటి వరకూ 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించడంతో పాటు పలుమార్లు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సైతం సాధించిన 38 సంవత్సరాల సెరెనా..కేవలం ఆటద్వారానే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది.

పదెకరాల విస్తీర్ణంలో లంకంత ప్యాలెస్ లో నివసిస్తున్నా…కరోనా వైరస్ భయంతో వణికిపోతోంది.
లేటు వయసులో ఓ బిడ్డకు జన్మనివ్వడానికి ప్రాణాలనే పణంగా పెట్టి, మృత్యువుతో తుదివరకూ పోరాడి పునర్జన్మ పొందిన సెరెనాకు…కూతురు ఒలింపియా అంటే ప్రాణప్రదమే మరి. అందుకే కరోనా వైరస్ మాట వింటేనే తెలియని ఆందోళనకు గురవుతోంది.

సహజసిద్ధంగా వచ్చే దగ్గు, తుమ్ములంటే కరోనా వైరస్ మాత్రమే అనుకొనే మానసిక ఆదోళనలో చిక్కుకొంది. గత కొద్దివారాలుగా ప్రాక్టీస్ మాని…మనుషులకు దూరంగా ఉంటూ…తనకుతానుగా లాక్ డౌన్ పాటిస్తోంది. ఇదంతా తన కుమార్తే కోసమేనని పిచ్చితల్లి సెరెనా వాపోతోంది.

Tags:    
Advertisement

Similar News