ఏపీలో ఎన్నికల వేడి... పవన్ కు సినిమాల వేడి

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చేసి సినిమాలు చేస్తున్నారు. జనసేనకు ఆర్థికబలం చేకూర్చడం.. కుటుంబ పోషణ, పిల్లల ఫీజులకోసం, పార్టీని నడపాలంటే డబ్బులు కావాల్సి రావడంతోనే తప్పని సరి పరిస్థితుల్లోనే సినిమాలు చేయాలనుకుంటున్నానని పవన్ కళ్యాణ్  చెప్పారు కూడా. అయితే పవన్ ను ప్రశాంతంగా సినిమాలు చేసుకోనివ్వడం లేదు వైసీపీ అధినేత, సీఎం జగన్. ఈ ఎండాకాలంలో రెండు సినిమాలు పూర్తి చేసి వాటి ద్వారా ఆదాయం పొందాలని శరవేగంగా షూటింగ్ లో […]

Advertisement
Update: 2020-03-04 11:25 GMT

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చేసి సినిమాలు చేస్తున్నారు. జనసేనకు ఆర్థికబలం చేకూర్చడం.. కుటుంబ పోషణ, పిల్లల ఫీజులకోసం, పార్టీని నడపాలంటే డబ్బులు కావాల్సి రావడంతోనే తప్పని సరి పరిస్థితుల్లోనే సినిమాలు చేయాలనుకుంటున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు కూడా.

అయితే పవన్ ను ప్రశాంతంగా సినిమాలు చేసుకోనివ్వడం లేదు వైసీపీ అధినేత, సీఎం జగన్. ఈ ఎండాకాలంలో రెండు సినిమాలు పూర్తి చేసి వాటి ద్వారా ఆదాయం పొందాలని శరవేగంగా షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్ కల్యాణ్.

అయితే పవన్ సినిమా సెట్స్ లో ఉండగానే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. మార్చి లోనే లోకల్ ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు సైతం పంపించింది. మార్చి 21న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మార్చి 24న మున్సిపల్ ఎన్నికలు, మార్చి 27న పంచాయితీ ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

దీంతో సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న పవన్ ఇప్పుడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను పట్టించుకోవాలా? లేక సినిమాలు పూర్తి చేయాలా? స్థానిక ఎన్నికల్లో జనసేనను ఎలా నడిపించాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో చిక్కుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్న పవన్… ఇప్పుడు సినిమాల్లో సత్తా చాటే పనిలో బిజీగా ఉన్నారు. మరి పవన్ వస్తారో… రారో తెలియక జనసేన క్యాడర్ గందరగోళంలో ఉంది.

Tags:    
Advertisement

Similar News