తెలంగాణ బీజేపీలో మూడు ముక్కలాట... సీనియర్ల మద్దతు లక్ష్మణ్ కే నట!

బీజేపీ తెలంగాణ విభాగానికి అధ్యక్షుడి మార్పు ఖాయమైంది. త్వరలోనే ఈ నిర్ణయంపై అధిష్టానం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇంతలో.. పోటీలో ఉన్న నేతల పేర్లు.. వారికి అండగా ఉన్న అనుయాయుల పేర్లపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. డీకే అరుణ, అరవింద్, కృష్ణసాగర్ రావు పేర్లు కాస్త బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో.. డీకే అరుణ బయటి నుంచి వచ్చారు కాబట్టి.. అవకాశాలు తక్కువే. మిగిలిన ఇద్దరిలో అరవింద్.. పార్టీలో చేరి రెండు మూడేళ్లు కూడా కావడం […]

Advertisement
Update: 2020-03-03 03:53 GMT

బీజేపీ తెలంగాణ విభాగానికి అధ్యక్షుడి మార్పు ఖాయమైంది. త్వరలోనే ఈ నిర్ణయంపై అధిష్టానం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇంతలో.. పోటీలో ఉన్న నేతల పేర్లు.. వారికి అండగా ఉన్న అనుయాయుల పేర్లపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. డీకే అరుణ, అరవింద్, కృష్ణసాగర్ రావు పేర్లు కాస్త బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో.. డీకే అరుణ బయటి నుంచి వచ్చారు కాబట్టి.. అవకాశాలు తక్కువే.

మిగిలిన ఇద్దరిలో అరవింద్.. పార్టీలో చేరి రెండు మూడేళ్లు కూడా కావడం లేదు. కృష్ణసాగర్ రావు విషయానికి వస్తే.. రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమైన ఆయన.. ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం నెరపలేదు. కానీ.. బీజేపీ భావజాలానికి అతి దగ్గరగా నడుచుకున్న రాష్ట్ర నాయకుల్లో ఆయన ఒకరు. విస్తృతంగా టీవీ డిబేట్లకు హాజరై పార్టీ గొంతుకను వినిపిస్తూ వచ్చారు. అందుకే.. ఈ ముగ్గురిలో ఆయనకే ఎడ్జ్ ఉందన్న మాట వినిపిస్తోంది.

ఈ చర్చలో ఆసక్తికర విషయం ఏంటంటే.. పదవి దక్కే అవకాశం లేని నేతలు మాత్రం మళ్లీ పీఠాన్ని లక్ష్మణ్ కే దక్కేలా మద్దతుగా నిలుస్తున్నారు. ఇందుకు కారణాలు పరిశీలిస్తే.. లక్ష్మణ్ కు అంతగా అనుచర గణం లేదు. బీసీ కార్డుతో పాటు.. అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడి.. ఆయనకు అండగా నిలుస్తోంది. గత అనుభవమే ఆయనకు పెద్ద ప్లస్. పైగా.. ఆయన పదవిలో ఉంటే తమకు ఇబ్బంది ఉండదనేది సదరు సీనియర్లు గట్టిగా అభిప్రాయపడుతున్నారట.

ఇవన్ని కారణాలు చూపిస్తూ.. అధిష్టానం దగ్గర బ్యాక్ గ్రౌండ్ మేనేజ్ మెంట్ తో లక్ష్మణ్ కే పదవి మళ్లీ దక్కేలా చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇదంతా గమనిస్తున్న పుష్పం పార్టీ పెద్ద నేతలు.. తమ అవసరాలు, తెలంగాణలో పార్టీపై అంచనాల ఆధారంగా.. పని పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారట.

Tags:    
Advertisement

Similar News