చంద్రబాబు స్వగ్రామంలో ఉద్రిక్తత...

తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వగ్రామం.. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ, టీడీపీ నేతలు.. పోటాపోటీగా ప్రజా సదస్సులు నిర్వహిస్తుండడమే ఇందుకు కారణమైంది. 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సహజంగానే.. ఈ ప్రయత్నం టీడీపీ నేతలను చికాకుపరిచింది. వారు వైసీపీ నేతల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీకి పోటీగా.. నారావారిపల్లెలో టీడీపీ నేతలు కూడా సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 3 రాజధానుల […]

Advertisement
Update: 2020-02-02 02:10 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వగ్రామం.. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ, టీడీపీ నేతలు.. పోటాపోటీగా ప్రజా సదస్సులు నిర్వహిస్తుండడమే ఇందుకు కారణమైంది.

3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సహజంగానే.. ఈ ప్రయత్నం టీడీపీ నేతలను చికాకుపరిచింది. వారు వైసీపీ నేతల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

వైసీపీకి పోటీగా.. నారావారిపల్లెలో టీడీపీ నేతలు కూడా సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 3 రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా మంత్రులు హాజరు కాబోయే సమావేశానికి పోటీగా… టీడీపీ నాయకులు కూడా తమ గొంతుకను ప్రజలకు వివరిస్తామన్నారు. రాజధాని విషయంలో తమ వాదనను ప్రజలకు మరోసారి వివరిస్తామని చెప్పారు. ఈ ప్రయత్నాలతో.. నారావారిపల్లెలో ఉద్రిక్తత నెలకొంది.

స్వయంగా చంద్రబాబు సొంత ఊరు కావడం.. అందులోనూ ఒకే రోజు ప్రధాన పార్టీలు పోటాపోటీ సదస్సులు ఏర్పాటు చేయడంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సభలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరు పార్టీల నేతలు వ్యవహరించే తీరుకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు.

Tags:    
Advertisement

Similar News