పాక్ వేదికగా 2020 ఆసియాకప్

పాక్ గడ్డపై భారత్ ఆడటం అనుమానమే? పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగే 2020 ఆసియాకప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పాల్గొనటం డౌటుగా మారింది. తమదేశంలో జరిగే ఆసియాకప్ లో భారత్ పాల్గొనకుంటే… 2021లో భారత్ వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ కు తాము సైతం దూరంగా ఉంటామని పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు వాసిం ఖాన్ బెదిరించారు. ఆసియా క్రికెట్ మండలి అనుమతిస్తే…భారతజట్టు తన మ్యాచ్ లను తటస్థవేదికలో ఆడినా తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. […]

Advertisement
Update: 2020-01-27 03:24 GMT
  • పాక్ గడ్డపై భారత్ ఆడటం అనుమానమే?

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగే 2020 ఆసియాకప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పాల్గొనటం డౌటుగా మారింది. తమదేశంలో జరిగే ఆసియాకప్ లో భారత్ పాల్గొనకుంటే… 2021లో భారత్ వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ కు తాము సైతం దూరంగా ఉంటామని పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు వాసిం ఖాన్ బెదిరించారు.

ఆసియా క్రికెట్ మండలి అనుమతిస్తే…భారతజట్టు తన మ్యాచ్ లను తటస్థవేదికలో ఆడినా తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. 2020 సెప్టెంబర్ లో జరగాల్సిన ఈ టోర్నీలో ఆసియాఖండంలోని అగ్రశ్రేణి జట్లన్నీ ఢీ కొనబోతున్నాయి.

సరిహద్దు ఉగ్రవాదం కారణంగా భారత్-పాక్ దేశాల మధ్య అంతంత మాత్రం క్రీడాసంబంధాలు ఉండటంతో పొరుగుదేశం గడ్డపై జరగాల్సిన ఆసియాకప్ టోర్నీలో భారత్ పాల్గొనటం అనుమానంగా మారింది.

Tags:    
Advertisement

Similar News