ప్రపంచకప్ కు భారత టీ-20 మహిళా జట్టు

15 మంది సభ్యుల జట్టుకు హర్మన్ ప్రీత్ నాయకత్వం ఆస్ట్ర్రేలియా వేదికగా ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యే 2020 టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టుకు సూపర్ హిట్టర్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుంది. హర్యానాకు చెందిన 15 సంవత్సరాల షెఫాలీ వర్మ, బెంగాల్ ప్లేయర్ రిచా ఘోష్ తొలిసారిగా ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించగలిగారు. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టులో…స్మృతి మంధానా, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగేస్, హర్లీన్ డియోల్, దీప్తి […]

Advertisement
Update: 2020-01-12 22:29 GMT
  • 15 మంది సభ్యుల జట్టుకు హర్మన్ ప్రీత్ నాయకత్వం

ఆస్ట్ర్రేలియా వేదికగా ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యే 2020 టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టుకు సూపర్ హిట్టర్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుంది.

హర్యానాకు చెందిన 15 సంవత్సరాల షెఫాలీ వర్మ, బెంగాల్ ప్లేయర్ రిచా ఘోష్ తొలిసారిగా ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించగలిగారు.

హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టులో…స్మృతి మంధానా, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగేస్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ,వేద కృష్ణమూర్తి, రిచా ఘోశ్, తాన్యా భాటియా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరీ గయక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రకార్, అరుంధతి రెడ్డి, నుజాత్ పర్వీన్ ఉన్నారు.

మొత్తం ఆరుగురు యువప్లేయర్లకు తొలిసారిగా జట్టులో చోటు కల్పించారు.

ప్రపంచకప్ కు సన్నాహాకంగా ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగే ముక్కోణపు సిరీస్ లో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత్ పోటీపడనుంది.

Tags:    
Advertisement

Similar News