ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.... ఫిబ్రవరి 8న పోలింగ్

దేశం యావత్తూ అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునిల్ అరోరా ఇవాళ సాయంత్రం 3.30 గంటలకు ఢిల్లీలో ఈ ప్రకటనను వెలువరించారు. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జనవరి 14న ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుందని.. జనవరి 21తో నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ అని సీఈసీ అరోరా వెల్లడించారు. […]

Advertisement
Update: 2020-01-06 07:37 GMT

దేశం యావత్తూ అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునిల్ అరోరా ఇవాళ సాయంత్రం 3.30 గంటలకు ఢిల్లీలో ఈ ప్రకటనను వెలువరించారు. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

జనవరి 14న ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుందని.. జనవరి 21తో నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ అని సీఈసీ అరోరా వెల్లడించారు. జనవరి 22న నామినేషన్ల పరిశీలన.. జనవరి 24న నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

కాగా, ఢిల్లీలో ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనుండగా.. అదే నెల 11న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు సీఈసీ స్పష్టం చేశారు. ఢిల్లీలో 1.43 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 13,767 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 90 వేల మంది సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటారని సీఈసీ పేర్కొన్నారు.

70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ రాష్ట్రంలో…. 2015లో జరిగిన ఎన్నికల్లో రీఎలక్షన్స్ కు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలు గెలుచుకుంది. ఈ దఫా ఎలాగైనా ఢిల్లీలో పాగా వేయాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News