నాకు, పవన్ కు మధ్య అడ్డంకి ఉంది... నేను బిజీ... పవన్ దీక్షకు వెళ్ళను...

అసెంబ్లీలో పార్టీ అధ్యక్షుడు పవన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంగ్లీష్ మీడియం కు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీ బయట కూడా హాట్ కామెంట్స్ చేసారు. తనకు, పవన్ కు మధ్య ఒక అడ్డంకి ఉందని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీకి తనకు మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందని.. అది తొలగిపోతుందని భావిస్తున్నట్టు చెప్పారు. చాలా మంది దళితులు ప్రైవేటు పాఠశాలల్లో చదవలేకపోతున్నారని…. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని తాను స్వాగతించానని వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో […]

Advertisement
Update: 2019-12-11 05:21 GMT

అసెంబ్లీలో పార్టీ అధ్యక్షుడు పవన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంగ్లీష్ మీడియం కు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీ బయట కూడా హాట్ కామెంట్స్ చేసారు.

తనకు, పవన్ కు మధ్య ఒక అడ్డంకి ఉందని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీకి తనకు మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందని.. అది తొలగిపోతుందని భావిస్తున్నట్టు చెప్పారు.

చాలా మంది దళితులు ప్రైవేటు పాఠశాలల్లో చదవలేకపోతున్నారని…. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని తాను స్వాగతించానని వివరించారు.

అసెంబ్లీ సమావేశాల్లో తాను బిజీగా ఉన్నానని… అందువల్ల పవన్ కల్యాణ్ తలపెట్టిన రైతు దీక్షకు హాజరు కావడం లేదన్నారు.

జనసేనలో తనకు ప్రాధాన్యత ఉందా? లేదా? అనే దానిపై తరవాత మాట్లాడతానని రాపాక చెప్పారు. పార్టీ ముందు గ్రామ స్థాయిలో బలపడాలని, కమిటీలు వెయ్యాలని.. అదే విషయం పార్టీ అధ్యక్షుడు పవన్‌కు చెప్పానన్నారు.

Tags:    
Advertisement

Similar News