ప్రో-బాక్సింగ్ 11వ ఫైట్ కు విజేందర్ రెడీ

దుబాయ్ వేదికగా నవంబర్ 22న సమరం భారత ఏకైక ప్రో బాక్సర్ విజేందర్ సింగ్…తన కెరియర్ లో 11వ ఫైట్ కు సిద్ధమయ్యాడు. మిడిల్ వెయిట్ విభాగంలో WBO ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ విజేతగా ఉన్న విజేందర్…ఇప్పటి వరకూ తలపడిన 10 ఫైట్లలో అజేయంగా నిలిచాడు. మొత్తం 10 ఫైట్లలో ఎనిమిది నాకౌట్ విజయాలు, రెండు టెక్నికల్ నాకౌట్ విజయాలు ఉన్నాయి. ప్రో-బాక్సర్ గా మారటానికి ముందు… దోహా ఆసియా క్రీడల్లో కాంస్య, బీజింగ్ […]

Advertisement
Update: 2019-11-18 22:40 GMT
  • దుబాయ్ వేదికగా నవంబర్ 22న సమరం

భారత ఏకైక ప్రో బాక్సర్ విజేందర్ సింగ్…తన కెరియర్ లో 11వ ఫైట్ కు సిద్ధమయ్యాడు. మిడిల్ వెయిట్ విభాగంలో WBO ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ విజేతగా ఉన్న విజేందర్…ఇప్పటి వరకూ తలపడిన 10 ఫైట్లలో అజేయంగా నిలిచాడు.

మొత్తం 10 ఫైట్లలో ఎనిమిది నాకౌట్ విజయాలు, రెండు టెక్నికల్ నాకౌట్ విజయాలు ఉన్నాయి. ప్రో-బాక్సర్ గా మారటానికి ముందు… దోహా ఆసియా క్రీడల్లో కాంస్య, బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాలు నెగ్గిన రికార్డు ఉంది.

అంతేకాదు…అర్జున, రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలు అందుకొన్న విజేందర్ 2009లో పద్మశ్రీ అవార్డును సైతం అందుకొన్నాడు.

దుబాయ్ సమరంలో విజేందర్ ప్రత్యర్థి ఎవరో ప్రమోటర్లు త్వరలో ప్రకటించనున్నారు.

Tags:    
Advertisement

Similar News