రివర్స్‌లో కాసుల పంట... వెలిగొండలో 62 కోట్లు ఆదా

రివర్స్ టెండరింగ్ విధానం ఏపీ ప్రభుత్వానికి వందల కోట్లను ఆదా చేస్తోంది. ఇప్పటికే పోలవరంలో 782 కోట్లు, జెన్‌కో బొగ్గు రవాణాలో 164 కోట్ల ఆదా కాగా… తాజాగా వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌లో 62 కోట్లు మిగిలింది. ఈ పనిని గతంలో ఎంపీ సీఎం రమేష్ కంపెనీ దక్కించుకుంది. ఈ టెండర్లలో భారీగా అవకతవకలు ఉన్నాయని నిపుణుల కంపెనీ తేల్చడంతో టెండర్లు రద్దు చేసి రివర్స్‌కు వెళ్లింది ప్రభుత్వం. రివర్స్‌ టెండరింగ్‌లో వెలిగొండ ప్రాజెక్టు పనులను […]

Advertisement
Update: 2019-10-19 19:39 GMT

రివర్స్ టెండరింగ్ విధానం ఏపీ ప్రభుత్వానికి వందల కోట్లను ఆదా చేస్తోంది. ఇప్పటికే పోలవరంలో 782 కోట్లు, జెన్‌కో బొగ్గు రవాణాలో 164 కోట్ల ఆదా కాగా… తాజాగా వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌లో 62 కోట్లు మిగిలింది.

ఈ పనిని గతంలో ఎంపీ సీఎం రమేష్ కంపెనీ దక్కించుకుంది. ఈ టెండర్లలో భారీగా అవకతవకలు ఉన్నాయని నిపుణుల కంపెనీ తేల్చడంతో టెండర్లు రద్దు చేసి రివర్స్‌కు వెళ్లింది ప్రభుత్వం.

రివర్స్‌ టెండరింగ్‌లో వెలిగొండ ప్రాజెక్టు పనులను తక్కువ ధరకే చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముందుకొచ్చింది. రివర్స్ టెండరింగ్‌లో రూ. 491. 37 కోట్లకే మేఘా సంస్థ పనులు దక్కించుకుంది. రివర్స్ టెండరింగ్‌లో చివరి వరకు నాలుగు సంస్థలు పోటీ పడ్డాయి.

రివర్స్ టెండరింగ్‌లో సీఎం రమేష్‌కే చెందిన రిత్విక్ సంస్థ కూడా తక్కువ ధరకు పనులు చేస్తామంటూ పోటీ పడింది. రివర్స్ టెండరింగ్‌లో రిత్విక్ సంస్థ, మేఘా ఇంజనీరింగ్, పటేల్ ఇన్‌ఫ్రా, ఆర్‌ఆర్‌ ఇన్‌ఫ్రాలు పోటీ పడ్డాయి. ఆఖరికి 7 శాతం తక్కువ ధరకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ పనులు దక్కించుకుంది.

Tags:    
Advertisement

Similar News