సౌతాఫ్రికాపై వెయ్యి పరుగుల విరాట్ కొహ్లీ

సఫారీలపై 1000 పరుగుల మొనగాళ్లు సచిన్, ద్రావిడ్, వీరూ భారత కెప్టెన్ కమ్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ.. సౌతాఫ్రికా ప్రత్యర్థిగా టెస్ట్ క్రికెట్లో వెయ్యి పరుగుల మైలురాయి చేరాడు. పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరుగుతున్న రెండోటెస్ట్ రెండోరోజు ఆటలో కొహ్లీ ఈ ఘనత సొంతం చేసుకొన్నాడు. గ్రేట్ల సరసన నయాగ్రేట్… సౌతాఫ్రికాపై ఇప్పటికే 1000 పరుగుల రికార్డు సాధించిన మాస్టర్ సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్ ల సరసన కొహ్లీ […]

Advertisement
Update: 2019-10-11 22:13 GMT
  • సఫారీలపై 1000 పరుగుల మొనగాళ్లు సచిన్, ద్రావిడ్, వీరూ

భారత కెప్టెన్ కమ్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ.. సౌతాఫ్రికా ప్రత్యర్థిగా టెస్ట్ క్రికెట్లో వెయ్యి పరుగుల మైలురాయి చేరాడు. పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరుగుతున్న రెండోటెస్ట్ రెండోరోజు ఆటలో కొహ్లీ ఈ ఘనత సొంతం చేసుకొన్నాడు.

గ్రేట్ల సరసన నయాగ్రేట్…

సౌతాఫ్రికాపై ఇప్పటికే 1000 పరుగుల రికార్డు సాధించిన మాస్టర్ సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్ ల సరసన కొహ్లీ చోటు సంపాదించాడు.

సఫారీలపై 11 టెస్టుల్లో 1000 పరుగులు

సఫారీలపై తన కెరియర్ లో ప్రస్తుత పూణే టెస్ట్ వరకూ 11 మ్యాచ్ లు, 19 ఇన్నింగ్స్ లో కొహ్లీ 1000 పరుగులతో 50.00 కి పైగా సగటు నమోదు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

సచిన్ దే అగ్రస్థానం…

సౌతాఫ్రికా ప్రత్యర్థిగా తన కెరియర్ లో 25 టెస్టులు ఆడిన మాస్టర్ సచిన్ టెండుల్కర్..45 ఇన్నింగ్స్ లో 1741 పరుగులు సాధించాడు. ఇందులో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు..42.46 సగటు సైతం ఉన్నాయి.

ఇక.. .వీరబాదుడు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కేవలం 15 టెస్టులు, 26 ఇన్నింగ్స్ లో 1306 పరుగులు సాధించాడు. ఓ ట్రిపుల్ సెంచరీతో సహా మొత్తం 5 శతకాలు, 2 అర్థ శతకాలు బాదాడు. 50.23 సగటు సైతం నమోదు చేశాడు.

ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ 21 టెస్టులు, 40 ఇన్నింగ్స్ లో 1252 పరుగులు సాధించాడు. 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో 33. 38 సగటు నమోదు చేశాడు.

వీవీఎస్ లక్ష్మణ్ 976, సౌరవ్ గంగూలీ 947, మహ్మద్ అజరుద్దీన్ 779 పరుగులు సాధించారు.

Tags:    
Advertisement

Similar News