నాకు భయపడే కరీంనగర్ లో నలుగురికి మంత్రి పదవులిచ్చారు

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కరీంనగర్ మంత్రి గంగుల కమలాకర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. తాజాగా గంగుల ప్రధాన బిజినెస్ అయిన గ్రానైట్ అక్రమాలపై బండి కేంద్రంలోని గ్రీన్ ట్రిబ్యూనల్, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. ఇక గంగుల కూడా బండి సంజయ్ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు శానిటేషన్ కాంట్రాక్టుల్లో అవినీతి చేశాడని ఆరోపించారు. ఈ ఇద్దరూ ఇప్పుడు అక్రమాలపై హైకోర్టుకు వెళుతుండడం కరీంనగర్ రాజకీయాలను వేడెక్కించింది. 2018 డిసెంబర్ లో […]

Advertisement
Update: 2019-09-21 02:03 GMT

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కరీంనగర్ మంత్రి గంగుల కమలాకర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న విభేదాలు మళ్లీ బయటపడ్డాయి.

తాజాగా గంగుల ప్రధాన బిజినెస్ అయిన గ్రానైట్ అక్రమాలపై బండి కేంద్రంలోని గ్రీన్ ట్రిబ్యూనల్, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. ఇక గంగుల కూడా బండి సంజయ్ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు శానిటేషన్ కాంట్రాక్టుల్లో అవినీతి చేశాడని ఆరోపించారు. ఈ ఇద్దరూ ఇప్పుడు అక్రమాలపై హైకోర్టుకు వెళుతుండడం కరీంనగర్ రాజకీయాలను వేడెక్కించింది.

2018 డిసెంబర్ లో జరిగిన కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ ను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచాడు గంగుల కమాలకర్. అయితే బండి కరీంనగర్ ఎంపీగా పోటీచేసి అనూహ్యంగా గెలిచాడు. దీంతో వీరిద్దరి మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది.

తాజాగా తనకు భయపడే కరీంనగర్ జిల్లాకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చారని.. ఓడిన వినోద్ కు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చారని.. కరీంనగర్ ను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే అయిన గంగులను మంత్రిని చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఇక గంగుల కూడా బండి కార్పొరేటర్ గా ఉన్నప్పుడు దోచిన శానిటేషన్ నిధులంటూ బయటకు తెచ్చాడు..

ఇలా కరీంనగర్ లో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య రగులుతున్న వివాదం ఆదిపత్య పోరుగా మారింది. అది హైకోర్టుల్లో పిటీషన్లు వేసేదాకా కూడా వెళుతోంది.

కరీంనగర్ కార్పొరేషన్ పై జెండా ఎగురవేసేందుకే బండి, గంగులలు ఇలా కత్తులు నూరుతున్నట్టు అర్థమవుతోందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో కరీంనగర్ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నారని అంటున్నారు. మరి మున్సిపల్ ఎన్నికల్లో ఎవరిది విజయం అనేది ఫలితంతో తేలనుంది.

Tags:    
Advertisement

Similar News