భజరంగ్, రవి దహియాలకు ఒలింపిక్స్ అర్హత

కాంస్య పతకం పోటీలో భజరంగ్, దహియా భారత వస్తాదులు భజరంగ్ పూనియా, రవి దహియా…వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించారు. కజకిస్తాన్ లోని నూర్ సుల్తాన్ వేదికగా జరుగుతున్న 2019 ప్రపంచకుస్తీ పోటీల సెమీస్ కు అర్హత సాధించడంతోనే ఈ ఇద్దరు మల్లయోధులకు ఒలింపిక్స్ టికెట్లు ఖాయమయ్యాయి. అయితే..ఫైనల్లో చోటు కోసం కజకిస్థాన్ వస్తాదు దౌలత్ నియాజ్ బెకోవోతో జరిగిన సెమీస్ సమరంలో ప్రపంచ నంబర్ వన్ భజరంగ్ తుదివరకూ పోరాడి ..రిఫరీ వివాదాస్పద నిర్ణయంతో […]

Advertisement
Update: 2019-09-19 18:59 GMT
  • కాంస్య పతకం పోటీలో భజరంగ్, దహియా

భారత వస్తాదులు భజరంగ్ పూనియా, రవి దహియా…వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించారు. కజకిస్తాన్ లోని నూర్ సుల్తాన్ వేదికగా జరుగుతున్న 2019 ప్రపంచకుస్తీ పోటీల సెమీస్ కు అర్హత సాధించడంతోనే ఈ ఇద్దరు మల్లయోధులకు ఒలింపిక్స్ టికెట్లు ఖాయమయ్యాయి.

అయితే..ఫైనల్లో చోటు కోసం కజకిస్థాన్ వస్తాదు దౌలత్ నియాజ్ బెకోవోతో జరిగిన సెమీస్ సమరంలో ప్రపంచ నంబర్ వన్ భజరంగ్ తుదివరకూ పోరాడి ..రిఫరీ వివాదాస్పద నిర్ణయంతో ఓటమి పాలై …కాంస్య పతకం రేసులో మిగిలాడు.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన సెమీస్ సమరంలో భజరంగ్, నియాజ్ బెకోవ్ చెరో 9 పాయింట్లు సాధించి సమఉజ్జీలుగా నిలిచారు. మెరుగైన నైపుణ్యం ప్రదర్శించిన భజరంగ్ కు ఇవ్వాల్సిన అదనపు పాయింట్లను ప్రత్యర్థికి నియాజ్ బెకోవ్ కు ఇవ్వటం ద్వారా రిఫరీ పక్షపాతధోరణితో వ్యవహరించారు. చివరకు నియాజ్ బెకోవ్ ను విజేతగా ప్రకటించడంతో…భజరంగ్ పూనియా బంగారు ఆశలు అడియాసలుగా మిగిలాయి.

గతంలోనే ప్రపంచ కుస్తీ రజత, కాంస్య పతకాలు సాధించిన భజరంగ్ పూనియా..ప్రస్తుత టో్ర్నీలో కాంస్య పతకం కోసం పోరాడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

సెమీస్ లోనే ఓడిన రవి దహియా…

57 కిలోల విభాగంలో రవి దహియాకు సైతం సెమీస్ లోనే పరాజయం తప్పలేదు. రష్యా మల్లయోధుడు, ప్రపంచ చాంపియన్ జవూర్ ఉగియేవ్ చేతిలో 4-6తో ఓటమి పొంది కాంస్య పతకం పోటీలో మిగిలాడు.

మహిళల విభాగంలో వినేశ్ పోగట్, పురుషుల విభాగంలో భజరంగ్, రవి ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ద్వారా తమ సత్తా చాటుకొన్నారు.

Tags:    
Advertisement

Similar News