పోలీసుల అదుపులో కీలక విషయాలు చెప్పిన శేఖర్ చౌదరి

వరద సహాయకచర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ప్రజలను నమ్మించేందుకు రైతు వేషం కట్టడంతో పాటు… మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పైనా, యాదవ కులంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నారు. శేఖర్ చౌదరిది గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం. జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేసే పెయిడ్‌ పబ్లిసిటీలో ఇతడు కీలకంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటనల్లో కూడా నటించాడు. ఇటీవల వరద […]

Advertisement
Update: 2019-08-24 21:17 GMT

వరద సహాయకచర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ప్రజలను నమ్మించేందుకు రైతు వేషం కట్టడంతో పాటు… మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పైనా, యాదవ కులంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నారు.

శేఖర్ చౌదరిది గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం. జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేసే పెయిడ్‌ పబ్లిసిటీలో ఇతడు కీలకంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటనల్లో కూడా నటించాడు.

ఇటీవల వరద సమయంలో రైతు వేషం కట్టి … తానే ఒక రైతును అని ప్రజలను నమ్మించడం ద్వారా రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్న భావన కలిగించేందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నటించాడు శేఖర్‌ చౌదరి. దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

పోలీసుల విచారణలో తాము కుట్రలో భాగంగానే రైతు వేషం కట్టి ప్రభుత్వాన్ని తిట్టినట్టు అంగీకరించాడు. తనతో పాటు ప్రభుత్వంపై బురద జల్లేందుకు పలువురిని టీడీపీ ఉపయోగిస్తున్నట్టు చెప్పాడని సమాచారం.

వివిధ వర్గాల ముసుగులో పెయిడ్ ఆర్టిస్టులే ప్రభుత్వాన్ని తిట్టిపోసి… ఈ వీడియోలను యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికలపై పోస్టు చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు జరుగుతున్న కుట్రను అతడు బయటపెట్టినట్టు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News