మర్రి వర్సెస్ రజని

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీలో వర్గ పోరు ముదురుతోంది. నియోజక వర్గంపై ఆధిపత్యం కోసం ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మర్రి రాజశేఖర్ వర్గాన్ని బలహీనపరిచేందుకు విడదల రజని ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణ అటువైపు నుంచి వస్తోంది. నియోజకవర్గంలో రజని వర్గీయులు ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో మర్రి ఫొటో ఉండడం లేదు. మర్రి వర్గీయులు ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే రజని ఫొటోలు ఉండడం లేదు. శుక్రవారం ఇదే అంశం ఇరు వర్గాల మధ్య […]

Advertisement
Update: 2019-08-17 00:04 GMT

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీలో వర్గ పోరు ముదురుతోంది. నియోజక వర్గంపై ఆధిపత్యం కోసం ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నారు.

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మర్రి రాజశేఖర్ వర్గాన్ని బలహీనపరిచేందుకు విడదల రజని ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణ అటువైపు నుంచి వస్తోంది. నియోజకవర్గంలో రజని వర్గీయులు ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో మర్రి ఫొటో ఉండడం లేదు.

మర్రి వర్గీయులు ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే రజని ఫొటోలు ఉండడం లేదు. శుక్రవారం ఇదే అంశం ఇరు వర్గాల మధ్య వివాదానికి కారణమైంది. మర్రి పుట్టిన రోజు సందర్భంగా చిలకలూరిపేటలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా… సాయంత్రం మున్సిపల్ అధికారులు వాటిని తొలగించారు. దాంతో మర్రి వర్గీయులు ఆందోళనకు దిగారు.

ఎమ్మెల్యేకు సంబంధించిన ఫ్లెక్సీలు రోజుల తరబడి ఉంటున్నా వాటి జోలికి వెళ్లకుండా… కేవలం మర్రి రాజశేఖర్‌కు చెందిన ఫ్లెక్సీలను మాత్రమే తొలగించారంటూ మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

ఇంతలో ఎమ్మెల్యే అనుచరులు కూడా రావడంతో ఇరు వర్గాలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకున్నారు. చివరకు పోలీసులు అక్కడి చేరుకుని ఇరు వర్గాల వారిని పంపించేశారు.

Tags:    
Advertisement

Similar News