పథకం ప్రారంభానికి మోడీని ఆహ్వానించా

అక్టోబర్‌ నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం కింద ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా 12 వేల 500 ఇస్తారు. ఈ పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రధాని మోడీ చేతుల మీదుగానే ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. సెప్టెంబర్ నుంచి తాను జిల్లాల్లో పర్యటిస్తానని వివరించారు. జిల్లాల్లో పథకాల అమలును స్వయంగా తానే పర్యవేక్షిస్తానని కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. రైతు […]

Advertisement
Update: 2019-08-13 03:41 GMT

అక్టోబర్‌ నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం కింద ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా 12 వేల 500 ఇస్తారు. ఈ పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.

ప్రధాని మోడీ చేతుల మీదుగానే ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. సెప్టెంబర్ నుంచి తాను జిల్లాల్లో పర్యటిస్తానని వివరించారు. జిల్లాల్లో పథకాల అమలును స్వయంగా తానే పర్యవేక్షిస్తానని కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.

రైతు భరోసా పథకంలో ఒక్కో రైతుకు ఆరువేల రూపాయలు కేంద్రం నుంచి కూడా రానుంది. ఆ సొమ్ముతో కలిపి ఈ పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో మోడీని పథకం ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నారు. గతంలో చంద్రబాబు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించే వారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో నడిచే పథకాలకు కూడా తన పేరే పెట్టుకునే వారు చంద్రబాబు. పథకాల ప్రచారంలోనూ కేవలం తన ఫొటోను మాత్రమే ముద్రించేలా చంద్రబాబు జాగ్రత్తపడేవారు. కానీ జగన్ మాత్రం కేంద్రం నుంచి నిధుల వచ్చే పథకాలపై ప్రధాని మోడీ ఫొటోను కూడా ముద్రిస్తున్నారు. కేంద్రానికి కూడా క్రెడిట్ ఇస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News