విజయవాడ గోశాలలో 100 ఆవులు మృతి

విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి ఏకంగా ఒకేసారి 100 ఆవులు మృత్యువాతపడ్డాయి. మరికొన్ని ఆవులు చావు బతుకుల మధ్య ఉన్నాయి. రాత్రి ఆవులకు వేసిన దాణాపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆవులు ఎందుకు చనిపోయాయి అన్న దానిపై వైద్యులు పరిశీలన చేస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత ఆవుల మృతికి కారణాలు చెబుతామని వైద్యులు వెల్లడించారు. భారీగా ఆవులు మృతి చెందిన నేపథ్యంలో అధికారులు గోశాలను పరిశీలించారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. […]

Advertisement
Update: 2019-08-09 23:17 GMT

విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి ఏకంగా ఒకేసారి 100 ఆవులు మృత్యువాతపడ్డాయి. మరికొన్ని ఆవులు చావు బతుకుల మధ్య ఉన్నాయి. రాత్రి ఆవులకు వేసిన దాణాపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆవులు ఎందుకు చనిపోయాయి అన్న దానిపై వైద్యులు పరిశీలన చేస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత ఆవుల మృతికి కారణాలు చెబుతామని వైద్యులు వెల్లడించారు. భారీగా ఆవులు మృతి చెందిన నేపథ్యంలో అధికారులు గోశాలను పరిశీలించారు.

ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ఇదే గోశాలలో గతంలో 24 ఆవులు చనిపోయాయి. ఆ సమయంలో కూడా దాణా వల్లే ఆవులు మృతి చెందినట్టు గుర్తించారు. ఇప్పుడు ఆవులు ఎందుకు చనిపోయాయి? అన్నది వైద్యులు నిర్వహించే పోస్టుమార్టంలో తేలే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News