లాడెన్‌ కుమారుడు హతం !

ప్రపంచాన్ని వణికించిన అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ కుమారుడు హతమైనట్టు అమెరికా వార్త సంస్థలు చెబుతున్నాయి. ఒసామా కుమారుడు, 29 ఏళ్ల హంజా బిన్ లాడెన్‌ హతమైనట్టు కథనాలను ప్రసారం చేశాయి. అయితే ఈ విషయాన్ని వైట్‌హౌజ్ అధికారికంగా ధృవీకరించలేదు. హంజా హతమైనట్టు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అంటూ అక్కడి టీవీ చానళ్లు కథనాలను ప్రసారం చేశాయి. బిన్ లాడెన్‌కు మొత్తం 20 మంది సంతానం. వారిలో 15వ వాడైన హంజా… […]

Advertisement
Update: 2019-07-31 22:52 GMT

ప్రపంచాన్ని వణికించిన అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ కుమారుడు హతమైనట్టు అమెరికా వార్త సంస్థలు చెబుతున్నాయి.

ఒసామా కుమారుడు, 29 ఏళ్ల హంజా బిన్ లాడెన్‌ హతమైనట్టు కథనాలను ప్రసారం చేశాయి.

అయితే ఈ విషయాన్ని వైట్‌హౌజ్ అధికారికంగా ధృవీకరించలేదు. హంజా హతమైనట్టు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అంటూ అక్కడి టీవీ చానళ్లు కథనాలను ప్రసారం చేశాయి.

బిన్ లాడెన్‌కు మొత్తం 20 మంది సంతానం. వారిలో 15వ వాడైన హంజా… తన తండ్రి మరణం తర్వాత ఆల్‌ఖైదా పగ్గాలు చేపట్టాడు. తండ్రిని హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో హంజా ఉన్నారని రిపోర్టులు కూడా వచ్చాయి.

దాంతో అతడి కోసం అమెరికా చాలా కాలంగా వెతుకుతోంది. పాకిస్థాన్‌, ఆప్ఘనిస్తాన్, సిరియాల్లో హంజా తలదాచుకున్నారన్న వార్తలు వచ్చాయి.

హంజా ఆచూకీ తెలిపిన వారికి అమెరికా మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని కూడా ప్రకటించింది.

The State Department’s Rewards for Justice program released a wanted poster for Hamza bin Laden. MUST CREDIT: U.S. State Department-Rewards for Justice handout
Tags:    
Advertisement

Similar News