నిర్లక్ష్యం కారణంగా ఖేల్‌రత్న అవార్డు మిస్

ఖేల్‌రత్న అవార్డు కోసం తాను చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురి కావడంపై భారత మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పంజాబ్ క్రీడా శాఖ నిర్లక్ష్యం కారణంగానే తనకు ఖేల్‌రత్న దక్కకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖేల్‌రత్న అవార్డు కోసం ఇటీవల హర్బజన్ సింగ్‌ పంజాబ్ క్రీడా శాఖకు దరఖాస్తు చేశాడు. మిగిలిన లాంచనాలు పూర్తి చేసిన తర్వాత పంజాబ్ క్రీడా శాఖ ఆ దరఖాస్తును కేంద్ర క్రీడా శాఖకు పంపింది. […]

Advertisement
Update: 2019-08-01 01:12 GMT

ఖేల్‌రత్న అవార్డు కోసం తాను చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురి కావడంపై భారత మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పంజాబ్ క్రీడా శాఖ నిర్లక్ష్యం కారణంగానే తనకు ఖేల్‌రత్న దక్కకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖేల్‌రత్న అవార్డు కోసం ఇటీవల హర్బజన్ సింగ్‌ పంజాబ్ క్రీడా శాఖకు దరఖాస్తు చేశాడు. మిగిలిన లాంచనాలు పూర్తి చేసిన తర్వాత పంజాబ్ క్రీడా శాఖ ఆ దరఖాస్తును కేంద్ర క్రీడా శాఖకు పంపింది. అయితే ఆ దరఖాస్తును కేంద్ర క్రీడా శాఖ తిరస్కరించింది. దరఖాస్తును చాలా ఆలస్యంగా పంపారన్న కారణంతో దాన్ని తిరస్కరించింది.

అ పరిణామంపై హర్బజన్ మండిపడ్డాడు. పంజాబ్ అధికారుల అలసత్వంపై విచారణ జరిపించాల్సిందిగా పంజాబ్ క్రీడా శాఖ మంత్రిని డిమాండ్‌ చేశారు. తాను సరైన సమయంలోనే దరఖాస్తు చేశానని…కానీ పంజాబ్ అధికారులే ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వానికి పంపించారని సింగ్ వాపోయాడు.

హర్బజన్ సింగ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ అంశంపై విచారణకు ఆదేశిస్తున్నట్టు పంజాబ్ క్రీడాశాఖ మంత్రి ప్రకటించారు. ఈసారి తిరస్కరణకు గురైనప్పటికీ వచ్చేసారి అయినా తన దరఖాస్తును ఖేల్‌రత్న అవార్డు కోసం సకాలంలో పంపించాలని హర్బజన్ సింగ్ కోరారు.

Tags:    
Advertisement

Similar News