ఆఖరి ఓవర్‌లో ధోని స్థితి ఏం చెబుతోంది ?

ధోని. ఒకప్పుడు అభిమానులు మనోడు ఎప్పుడు క్రీజ్‌లోకి వస్తాడా అని ఎదురుచూసేశారు. అప్పటి వరకు ఆడుతున్న ఒక ఆటగాడు త్వరగా అవుటైపోయి ధోని వస్తే బాగుండూ అని ఎదురుచూసిన కాలం కూడా ఉంది. కానీ ఇప్పుడు ధనాధన్ ధోని … వచ్చాడయ్యో ధోని అంటూ ట్రోలింగ్‌ ఎదుర్కొనే స్థాయికి వచ్చేశాడు. వరల్డ్‌ కప్‌లో వరుసగా ధోని బ్యాంటింగ్‌ వేగం చూసిన వారు ఆ ధోని ఈ ధోనియేనా అని ఆశ్చర్యపోతున్నారు. 50ఏళ్లు పైబడిన వ్యక్తి తరహాలో ఆ […]

Advertisement
Update: 2019-07-02 21:50 GMT

ధోని. ఒకప్పుడు అభిమానులు మనోడు ఎప్పుడు క్రీజ్‌లోకి వస్తాడా అని ఎదురుచూసేశారు. అప్పటి వరకు ఆడుతున్న ఒక ఆటగాడు త్వరగా అవుటైపోయి ధోని వస్తే బాగుండూ అని ఎదురుచూసిన కాలం కూడా ఉంది. కానీ ఇప్పుడు ధనాధన్ ధోని … వచ్చాడయ్యో ధోని అంటూ ట్రోలింగ్‌ ఎదుర్కొనే స్థాయికి వచ్చేశాడు.

వరల్డ్‌ కప్‌లో వరుసగా ధోని బ్యాంటింగ్‌ వేగం చూసిన వారు ఆ ధోని ఈ ధోనియేనా అని ఆశ్చర్యపోతున్నారు. 50ఏళ్లు పైబడిన వ్యక్తి తరహాలో ఆ ఆపసోపాలు ఏమిటి? అంటూ పెదవి విరుస్తున్నారు. ఇంగ్లడ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఒక దశలో గెలుస్తుందనుకున్నారు. కానీ ఆఖరి వరకు క్రీజ్‌లో ధోని ఉన్నప్పటికీ ఆఖరి పది ఓవర్లలో కేవలం 72 పరుగులు మాత్రమే టీమిండియా చేయడంతో భారత్‌ ఓటమి తప్పలేదు. ధోని లాంటి వ్యక్తి క్రీజ్‌లో ఉండగానే టార్గెట్‌ను చేధించలేక చేతులెత్తేయడం సగటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే తీరు. 40 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 251 పరుగుల స్థితిలో పటిష్టంగా ఉంది. అప్పటికి ధోని, రిషబ్ పంత్‌ క్రీజులో ఉన్నారు. ఈజీగా స్కోర్ 350 దాటిపోతుందని భావించారు. కానీ బంగ్లాదేశ్‌ పైనా ధోని ఏమాత్రం చెలరేగలేకపోయాడు. ఆఖరి పది ఓవర్లలో కేవలం 63 పరుగులు మాత్రమే ధోని క్రీజులో ఉండగా భారత్ సాధించింది.

ఆఖరి ఓవర్లలో ధోని ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని చూసి అభిమానులు మనసులో కన్నీరు పెట్టుకున్నంత పరిస్థితి. ఆఖరి ఓవర్లోనైనా సత్తా చాటాలని భావించిన ధోని… తొలి బాల్‌కు పరుగు తీయకుండా నిలబడ్డాడు. కానీ రెండో బంతిని కూడా ధోని ఎదుర్కోలేకపోయారు. రెండో బంతి డాట్‌ బాల్‌ అయిపోయింది.

దాంతో మరింత ఒత్తిడికి లోనైన ధోని బంతి తీరుతో సంబంధం లేకుండా మూడో బాల్ కు…. భారీ షాట్‌కు ప్రయత్నించారు. అంతలో అది గాల్లోకి లేచింది. ధోని అవుట్ అయ్యారు. ధోని లాంటి అగ్రశేణి ఆటగాడు ఇలా ఒక బంతిని బౌండరీ దాటించేందుకు… తనలో సత్తా ఉంది అని నిరూపించుకునేందుకు ఆఖరి ఓవర్‌లలో పడుతున్న తపన, ఆవేదన సగటు అభిమానులను బాధిస్తోంది.

Tags:    
Advertisement

Similar News