పోలవరం @ రూ. 55,548 కోట్లు, కేంద్రం ఆమోదం

పోలవరం అంచనాలను కేంద్రం అంగీకరించింది. సవరించిన పోలవరం అంచనాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2017-18 ధరల ప్రాతిపదికన పోలవరం వ్యయాన్ని రూ. 55, 548 కోట్లుగా కేంద్రం నిర్ధారించింది. ఇందులో పునరావాసం, భూసేకరణకు 33 వేల 168 కోట్లు కేటాయించనున్నారు. హెడ్‌ వర్క్‌కు రూ. 9వేల 734 కోట్లుగా కేంద్రం నిర్ధారించింది. పోలవరం కుడి కాలువ పనులకు రూ. 4,318 కోట్లు, ఎడమ కాలువకు రూ. 4, 202 కోట్లు, పవర్‌ హౌజ్‌కు రూ. 4, […]

Advertisement
Update: 2019-06-24 11:16 GMT

పోలవరం అంచనాలను కేంద్రం అంగీకరించింది. సవరించిన పోలవరం అంచనాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2017-18 ధరల ప్రాతిపదికన పోలవరం వ్యయాన్ని రూ. 55, 548 కోట్లుగా కేంద్రం నిర్ధారించింది.

ఇందులో పునరావాసం, భూసేకరణకు 33 వేల 168 కోట్లు కేటాయించనున్నారు. హెడ్‌ వర్క్‌కు రూ. 9వేల 734 కోట్లుగా కేంద్రం నిర్ధారించింది. పోలవరం కుడి కాలువ పనులకు రూ. 4,318 కోట్లు, ఎడమ కాలువకు రూ. 4, 202 కోట్లు, పవర్‌ హౌజ్‌కు రూ. 4, 124 కోట్లును కేంద్రం కేటాయించనుంది.

అటు.. అమరావతి- అనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ వే భూసేకరణ ఖర్చులో 50 శాతం భరించేందుకు కేంద్ర అంగీకరించింది.

Tags:    
Advertisement

Similar News