రాజ్యసభ వెబ్‌సైట్‌లో టీడీపీ విలీనం

రాజ్యసభలో టీడీపీ బీజేపీలో విలీనం అయిపోయింది. ఉప రాష్ట్రపతి కార్యాలయం అధికారిక ఉత్తర్వులు రాకముందే రాజ్యసభ వెబ్‌సైట్‌లో నలుగురు ఫిరాయింపు ఎంపీల పేర్లను బీజేపీ జాబితాలో చేర్చేశారు. ప్రస్తుతం రాజ్యసభ వెబ్‌సైట్‌లో టీడీపీకి ఇద్దరు ఎంపీలను మాత్రమే చూపిస్తున్నారు. కనకమేడల, సీతారామలక్ష్మీపేర్లు మాత్రమే టీడీపీ ఎంపీలుగా రాజ్యసభ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఫిరాయింపులను నిరోధించాలంటూ ఇటీవల పదేపదే ఉప రాష్ట్రపతి ఉపన్యాసాలు చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు ఆయన్ను కలిసి ఫిరాయింపులపై ఫిర్యాదులు చేయాలనుకున్నారు. కానీ ఇంతలోనే రాజ్యసభ […]

Advertisement
Update: 2019-06-21 05:35 GMT

రాజ్యసభలో టీడీపీ బీజేపీలో విలీనం అయిపోయింది. ఉప రాష్ట్రపతి కార్యాలయం అధికారిక ఉత్తర్వులు రాకముందే రాజ్యసభ వెబ్‌సైట్‌లో నలుగురు ఫిరాయింపు ఎంపీల పేర్లను బీజేపీ జాబితాలో చేర్చేశారు.

ప్రస్తుతం రాజ్యసభ వెబ్‌సైట్‌లో టీడీపీకి ఇద్దరు ఎంపీలను మాత్రమే చూపిస్తున్నారు. కనకమేడల, సీతారామలక్ష్మీపేర్లు మాత్రమే టీడీపీ ఎంపీలుగా రాజ్యసభ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

ఫిరాయింపులను నిరోధించాలంటూ ఇటీవల పదేపదే ఉప రాష్ట్రపతి ఉపన్యాసాలు చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు ఆయన్ను కలిసి ఫిరాయింపులపై ఫిర్యాదులు చేయాలనుకున్నారు.

కానీ ఇంతలోనే రాజ్యసభ వెబ్‌సైట్లో పేర్లు మార్చేశారు. వెంకయ్యనాయుడు కూడా టీడీపీ ఎంపీలను బీజేపీలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు.

Tags:    
Advertisement

Similar News