అలసందలతో ఆరోగ్యం

అలసందలను కొన్ని ప్రాంతాలలో బొబ్బర్లు లేదా బొబ్బర చిక్కుడు అని కూడా అంటారు. ఇవి రెండు రకాలుగా దొరుకుతాయి. ఒకటి తీగకు కాస్తే మరొకటి మామూలు చెట్లుకు కాస్తుంది. రెండింటిలోనూ ఒకే రకమైన ప్రయోజనాలు ఉంటాయి. అలసందలను ఉడకపెట్టి తింటారు. వీలున్న వారు కాల్చుకుని తింటారు. కూరలలోను, సలాడ్స్ లోనూ లేదా దోసెలు, వడలుగా చేసుకుని కూడా తింటారు. ఎలా తిన్నా ఇవి చాలా ఆరోగ్యం…. అలసందలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెల్సుకుందాం. అలసందలలో ఉన్న […]

Advertisement
Update: 2019-05-13 21:40 GMT

అలసందలను కొన్ని ప్రాంతాలలో బొబ్బర్లు లేదా బొబ్బర చిక్కుడు అని కూడా అంటారు. ఇవి రెండు రకాలుగా దొరుకుతాయి. ఒకటి తీగకు కాస్తే మరొకటి మామూలు చెట్లుకు కాస్తుంది. రెండింటిలోనూ ఒకే రకమైన ప్రయోజనాలు ఉంటాయి.

అలసందలను ఉడకపెట్టి తింటారు. వీలున్న వారు కాల్చుకుని తింటారు. కూరలలోను, సలాడ్స్ లోనూ లేదా దోసెలు, వడలుగా చేసుకుని కూడా తింటారు. ఎలా తిన్నా ఇవి చాలా ఆరోగ్యం…. అలసందలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెల్సుకుందాం.

  • అలసందలలో ఉన్న యాంటీ ఆక్సీడెంట్స్ శరీరంలో బ్యాక్టీరీయాను నివారిస్తాయి. అంతేకాదు ఇతర హానికర వైరల్ ఇన్ ఫెక్షన్స్ ను దరిచేరనివ్వదు.
  • అలసందలలోని విటమిన్స్ శరీరంలోకి హానికర టాక్సిన్స్ ను, ఫ్రీరాడికల్స్ ను అరికడతాయి.
  • బొబ్బర్లలో ఉన్న ప్రొటీన్స్, ఇతర పోషకాలు చర్మాన్ని కాపాడతాయి. చర్మం మృదువుగా ఉండేందుకు తోడ్పడతాయి.
  • ఇందులో ఉన్న విటమిన్ ఎ, విటమిన్ సి లు శరీరంలో రోగనిరోధక శక్తిని పేంచేందుకు సహాయపడతాయి.
  • అలసందలలో శక్తినిచ్చే ప్రోటీన్లు ఎక్కువ. క్యాలరీలు, కొవ్వూ చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అందువల్ల బరువు పెరగరు.
  • డయాబేటీస్ సమస్యతో బాధపడుతున్న వారికి తరచూ ఆకలి వేస్తుంది. అలాంటప్పుడు అలసందలు ఉడికించుకుని తింటే కడుపు నిండుగా ఉంటుంది.
  • బొబ్బర్లు బ్లడ్ కొలెస్ట్రాల్ స్దాయిలను అదుపు చేస్తుంది. దీని వల్ల గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
  • ఇందులో ఉన్న మెగ్నీషియం బ్లడ్ ప్రషర్ ను కంట్రోల్ చేస్తుంది.
  • అలసందలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కారణాన తొందరగా జీర్ణం కావడమే కాక మలబద్దకాన్ని నివారిస్తుంది.
  • అలసందలలో ఉన్న గ్లిజమిక్ ఇండెక్స్ (Glycemic Index) అంటే పిండిపదార్దం రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోకుండా కాపాడుతుంది.
Tags:    
Advertisement

Similar News