పనస.... ఆరోగ్యం కులాసా....

తండ్రి గర గర.. తల్లి పీచు పీచు…. బిడ్డలు రత్నాల మాణిక్యాలు. ఇది ఓ పొడుపు కథ. అయితే ఇది నిజం కూడా. పనస పండు తింటే మన బిడ్డలు రత్నాల్లా తయారవుతారు. ఎందుకంటే అందులో అన్ని పోషకాలు ఉన్నాయి. అన్ని పళ్ళల్లోనూ అతి బరువైన పండు పనస. ఇది మల్బరీ జాతికి చెందింది. మంచి సువాసనతో పాటు, ఎంతో రుచిగా ఉండే ఈ పండు తొనలను అందరూ ఇష్టపడతారు. ఈ పండు వేసవి కాలంలోనే దొరుకుతుంది. […]

Advertisement
Update: 2019-05-08 23:53 GMT

తండ్రి గర గర.. తల్లి పీచు పీచు…. బిడ్డలు రత్నాల మాణిక్యాలు. ఇది ఓ పొడుపు కథ. అయితే ఇది నిజం కూడా. పనస పండు తింటే మన బిడ్డలు రత్నాల్లా తయారవుతారు. ఎందుకంటే అందులో అన్ని పోషకాలు ఉన్నాయి. అన్ని పళ్ళల్లోనూ అతి బరువైన పండు పనస. ఇది మల్బరీ జాతికి చెందింది.

మంచి సువాసనతో పాటు, ఎంతో రుచిగా ఉండే ఈ పండు తొనలను అందరూ ఇష్టపడతారు. ఈ పండు వేసవి కాలంలోనే దొరుకుతుంది. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం….

  • పనసపండులో విటమిన్ ఎ, విటమిన్ సి తో పాటు మెగ్నీషియం, ఫైబర్, ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయి.
  • పనస పండులో ఉన్న పొటాషియం రక్తపోటును అదుపు చేస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటే గుండెకు సంబంధించిన సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు.
  • పనస జీర్ణశక్తిని పెంచుతుంది. పసన తింటే సుఖ విరోచనం అవుతుంది. ఇది మలబద్దక నివారిణి.
  • పనసపండులో ఉన్న విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. జుట్టుకు బలాన్ని ఇస్తుంది.
  • పనసపండులో క్యాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు, కండరాలకు మంచి పటుత్వాన్ని ఇస్తుంది.
  • పనసపండు థైరాయిడ్ హర్మోన్స్ ని సమతుల్యం చేసి, థైరాయిడ్ గ్రంథి హెచ్చుతగ్గులను అదుపు చేస్తుంది.
  • రక్తహీనతతో బాధపడే వారికి పనసపండు దివ్యౌషధం. ఇందులో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ స్దాయిలను మెరుగుపరుస్తుంది.
  • పనసపండులో చర్మసౌందర్యాన్ని కాపాడే గుణాలు ఉన్నాయి. పనస తొనలను తినే వారికి వయస్సు కనిపించదు.
  • డిప్రెషన్, వత్తిడి, టెన్షన్ వంటి సమస్యలకు పనస పండు మంచి మందు.
  • మలబద్దకం, మూలశంక తో బాధపడుతున్న వారు వేసవిలో దొరికే ఈ పండును తరచూ తింటే మంచి ఫలితం ఉంటుంది.
  • పనస పండు శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా కాపాడి, రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు తోడ్పడుతుంది.
  • ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి.
  • ఉబ్బస వ్యాధితో బాధపడే వారు పనస పండు తింటే మంచి ఫలితం ఉంటుంది.
  • పనసతొనలు ఎన్ని తిన్నా ఆఖరి తొనలో కొద్దిగా నువ్వుల నూనె వేసుకుని తింటే ఈ పండులో ఉన్న దుష్ప్ర్రభావాలు అన్ని కూడా పోతాయి.
Tags:    
Advertisement

Similar News