పొషక విలువల పొట్లకాయ

పొట్లకాయను ఇంగ్లీషులో ‘స్నేక్ గార్డ్’ అని లేదా ‘సర్పెంట్ గార్డ్’ అని పిలుస్తారు. పొట్లకాయను చాలా మంది ఇష్టపడరు. అయితే ఇందులో అనేక పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. పొట్లకాయ తేలికగా జీర్ణం అవుతుంది. ఇది సాధారణంగా పథ్యానికి ఉపయోగిస్తారు. ఆహారాన్ని ఒక ప్రణాళిక బద్దంగా తింటే ఎటువంటి సమస్యలు దరి చేరవు. ప్రతీ ఆహార పదార్ధం గురించి అవగాహన అవసరం. పొట్లకాయలో ఉన్న పోషకాలు… అవి మన ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం చూపిస్తాయో తెల్సుకుందాం. పచ్చకామెర్లకు […]

Advertisement
Update: 2019-05-04 21:15 GMT

పొట్లకాయను ఇంగ్లీషులో ‘స్నేక్ గార్డ్’ అని లేదా ‘సర్పెంట్ గార్డ్’ అని పిలుస్తారు. పొట్లకాయను చాలా మంది ఇష్టపడరు. అయితే ఇందులో అనేక పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. పొట్లకాయ తేలికగా జీర్ణం అవుతుంది. ఇది సాధారణంగా పథ్యానికి ఉపయోగిస్తారు.

ఆహారాన్ని ఒక ప్రణాళిక బద్దంగా తింటే ఎటువంటి సమస్యలు దరి చేరవు. ప్రతీ ఆహార పదార్ధం గురించి అవగాహన అవసరం. పొట్లకాయలో ఉన్న పోషకాలు… అవి మన ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం చూపిస్తాయో తెల్సుకుందాం.

  • పచ్చకామెర్లకు పొట్లకాయ మంచి పథ్యంగా చెబుతారు. తేలికగా జీర్ణం అవుతుంది. అంతే కాదు పొట్లకాయ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది కూడా.
  • పొట్లకాయలో ఉండే పీచు ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు తోడ్పడుతుంది. మల బద్దకంతో బాధపడుతున్న వారు తరచూ పొట్లకాయ తింటే తేలికగా జీర్ణమై సుఖ విరోచనం అవుతుంది.
  • మలబద్దకం తీవ్రంగా ఉంటే ప్రతిరోజూ అరకప్పు పొట్లకాయ జ్యూసుతాగితే క్రమేపీ మలబద్దకం సమస్య తగ్గముఖం పడుతుంది.
  • ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరిగేందుకు అవకాశం లేదంటున్నారు వైద్యులు.
  • డయాబెటీస్ తో బాధపడుతున్న వారికి పొట్లకాయ మంచి ఔషధం. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ సమస్య ఉన్న వారు పొట్లకాయ తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  • ఇందులో ఉండే మెగ్నీషియం బీపీని అదుపులో ఉంచుతుంది.
  • దంతాల ఎముకలను, కండరాలను గట్టి పరచడంలో పొట్లకాయలో ఉన్న కాల్షియం ప్రధాన పాత్ర పోషిస్తుంది.
  • శరీరంలో ఉన్న ఎముకలను గట్టి పరచి, కండరాల నొప్పులను, వాపులను నివారిస్తుంది.
  • వృద్దాప్యంలో పొట్లకాయ తరచూ తింటే తేలికగా జీర్ణం కావడమే కాక, ఇందులో ఉండే క్యాల్షియం బోలు ఎముకల వ్యాధి నుంచి కాపాడుతుంది.
  • పొట్లకాయలో ఉన్న పోషకాలు, ఇతర ఖనిజాలు నాడీ వ్యవస్థను క్రమబద్దీకరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. దీని వల్ల బీపీ, షుగర్, ఊబకాయం, గుండె సమస్యలు రావని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • ఇందులో క్యాలరీలు, కొవ్వుకు సంబంధించిన పదార్ధాలు లేనందున బరువు పెరిగేందుకు అవకాశం లేదంటున్నారు న్యూట్రీషియన్స్.
  • పొట్లకాయ రసాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • శరీరంలో ఉన్న వ్యర్దాలను బయటకు పంపడానికి పొట్లకాయ ఎంతో ఉపయోగపడుతుంది.
Tags:    
Advertisement

Similar News