పల్లీలు.... ఆరోగ్య కారకాలు....

పల్లీలు… వేరుశనగ అని కూడా దీనికి పేరు. పేరు ఏదైనా ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. ప్రతీరోజూ గుప్పెడు వేరుశనగలు తింటే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీ ఆయుష్షుని పెంచుతాయి. వేరుశనగలలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని కూరల్లో, పల్లీలను పొడిలా చేసుకుని కూడా తినొచ్చు. ఇవి అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. వేరుసెనగ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వేరుశనగలో ఉన్న క్యాల్షియం ఎముకలు కండరాలను గట్టి పరుస్తుంది. వారంలో కనీసం రెండు సార్లు వేరుశనగను […]

Advertisement
Update: 2019-05-01 21:05 GMT

పల్లీలు… వేరుశనగ అని కూడా దీనికి పేరు. పేరు ఏదైనా ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. ప్రతీరోజూ గుప్పెడు వేరుశనగలు తింటే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీ ఆయుష్షుని పెంచుతాయి. వేరుశనగలలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని కూరల్లో, పల్లీలను పొడిలా చేసుకుని కూడా తినొచ్చు. ఇవి అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. వేరుసెనగ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

  • వేరుశనగలో ఉన్న క్యాల్షియం ఎముకలు కండరాలను గట్టి పరుస్తుంది. వారంలో కనీసం రెండు సార్లు వేరుశనగను ఆహారంలో తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు రావని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • వేరుశనగలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.
  • ఎనీమియా, రక్తహీనత వంటి సమస్యలను పల్లీలు నివారిస్తాయి.
  • ఇందులో ఉండే ప్రొటీన్లు… ఇతర పోషకాలు పిల్లల ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయి.
  • వేరుశనగలో విటమిన్ బి6, నియాసిన్, ఫొలెట్ ప్రీరాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి.
  • పల్లీలు తింటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు.
  • ప్రతి 50 గ్రాముల వేరుశనగలలో దాదాపు 4 గ్రాముల విటమిన్ ఇ ఉంటుందని, వైరల్ ఇన్ ఫెక్షన్లు, గుండె జబ్బులు నివారిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
  • ఇందులో రెస్ వెట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు నరాలు, ఆల్జీమర్స్ నుంచి రక్షణ కల్పిస్తాయంటున్నారు వైద్యులు.
  • మూత్రపిండాలలో రాళ్లను నివారించే గుణాలు పల్లీలలో ఉన్నాయి.
  • వేరుశనగలు మెటబాలీజం లెవెల్స్ ను పెంచడానికి తోడ్పడతాయి. శరీర జీవనక్రియ మెరుగుపడుతుంది.
  • పల్లీలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
  • పల్లీలు తినడం వల్ల మెదడుకు కావాల్సిన కెరొటినిన్ ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల మెదడు ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటుంది.
Tags:    
Advertisement

Similar News