ఉలవలు.... కరుగును రాళ్లు

ఉలవలు. ఇంగ్లీషులో హర్స్ గ్రామ్ (horse gram) అంటారు. పూర్వం ఉలవలు గేదెలకి, ఆవులకి దాణగా పెట్టేవారు. వీటిని గుగ్గిళ్లు అనే వారు. క్రమంగా వాటిలోని ఔషధ గుణాలు తెలిసిన తర్వాత మనుషులు కూడా తినడం మొదలు పెట్టారు. ఉలవలతో చేసిన చారు రుచికి పెట్టింది పేరు. ఉలవ చారును ఒక్కసారి రుచి చూస్తే ఇక వదలరు. సాధరణంగా ఉలవలు మూడు రంగులలో ఉంటాయి. అవి నలుపు, ఎరుపు, తెలుపు. ఈ మూడింటిలోనూ నల్ల ఉలవలు ఎంతో శ్రేష్టమైనవని […]

Advertisement
Update: 2019-04-24 21:21 GMT

ఉలవలు. ఇంగ్లీషులో హర్స్ గ్రామ్ (horse gram) అంటారు. పూర్వం ఉలవలు గేదెలకి, ఆవులకి దాణగా పెట్టేవారు. వీటిని గుగ్గిళ్లు అనే వారు. క్రమంగా వాటిలోని ఔషధ గుణాలు తెలిసిన తర్వాత మనుషులు కూడా తినడం మొదలు పెట్టారు.

ఉలవలతో చేసిన చారు రుచికి పెట్టింది పేరు. ఉలవ చారును ఒక్కసారి రుచి చూస్తే ఇక వదలరు. సాధరణంగా ఉలవలు మూడు రంగులలో ఉంటాయి. అవి నలుపు, ఎరుపు, తెలుపు. ఈ మూడింటిలోనూ నల్ల ఉలవలు ఎంతో శ్రేష్టమైనవని వైద్యులు చెబుతున్నారు. ఇక ఉలవల విలువ గురించి తెలుసుకుందాం.

  • ఉలవలు శరీరంలో ఉన్న వేడిని హరిస్తాయి.
  • వాతం, శ్వాస, మూలవ్యాధి, ఖఫం తగ్గించడం వంటి వాటికి ఉలవలు ఎంతో ఉపయోగపడతాయి.
  • ఉలవలు రుతు సమస్యలను (menstrual disorders) నివారిస్తుంది.
  • ఎక్కిళ్లు, నేత్ర రోగాలను రాకుండా చేయడంలో ఉలవలకు ఎంతో పేరుంది.
  • ఉలవ కషాయాన్ని ముల్లంగి ఆకు రసంతో కలిపి తీసుకుంటే మూత్రపిండాలల్లో ఉన్న రాళ్లు కరిగిపోతాయి.
  • ఉలవలు నల్లదబ్బ (spleen) లో కంతులను కరిగిస్తాయి.
  • ఉలవలను వేయించి ఒక గుడ్డలో కట్టి కముకు దెబ్బలు తగిలిన చోటా, ఇతర దెబ్బల వల్ల కలిగే నొప్పుల దగ్గర కాపడం పెడితే ఆ నొప్పులు చిటికెలో తగ్గుముఖం పడతాయి.
  • మూత్ర సమయంలో వచ్చే నొప్పి, మంట… ఉలవ కషాయం, ఉలవ చారు తాగితే తగ్గుతాయని వైద్యులు సూచిస్తున్నారు.
  • మూత్ర పిండాలలో ఎటువంటి సమస్యలున్నా వాటిని ఉలవలు నివారిస్తాయి.
  • ఉలవలలోని ఐరన్, ఫాస్ఫరస్ ఎనీమీయాను నివారిస్తాయి. ఇందులోని కాల్షియం ఎముకులకు, కండరాలకు శక్తినిస్తుంది. ఇక ఇందులోని ఫైబర్ మలబద్దకం రాకుండా అడ్డుకుంటుంది.
  • ఉలవలను ఉడికించి లేదా మొలకెత్తించి కూడా తీసుకోవచ్చు. ఇవి అనేక రోగాలను నివారిస్తాయి.
  • శరీరంలోని గ్లూకోజ్ ను అదుపు చేయడంలో ఉలవలు ఎంతో మేలు చేస్తాయి. ఇదే కాదు ఉలవలు బీపీని కూడా అదుపులో ఉంచుతాయి.
  • రక్తహీనతతో బాధపడేవారు తరచూ ఉలవలను కషాయంగా కాని, చారు రూపంలా గాని తీసుకుంటే శరీరంలో కొత్త రక్తం వస్తుంది.
  • ఉలవల్లో ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని ఇచ్చి నీరసం, నిసత్తువను తగ్గిస్తాయి.
  • ఎదిగే పిల్లలకు వారి శరీర నిర్మాణం చక్కగా ఉండేందుకు ఉలవలు ఎంతో మేలు చేస్తాయి.
  • ఉలవలు శరీరంలో ఉన్న అధిక కొవ్వును కరిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
  • అధిక బరువుతో బాధపడుతున్న వారు ఉలవలను కషాయంలా కాని, చారులా కాని తీసుకుంటే క్రమేపి బరువు తగ్గుతారు.
  • ఆకలి మందగించడం లేదా రుచి తెలియకపోవడం వంటి సమస్యలకు ఉలవలు దివ్యౌషధం.
  • ఆజీర్తి, విరోచనాలతో బాధపడుతున్నవారు ఒక్క గ్లాసు ఉలవల కషాయం తీసుకుంటే విరోచనాలు తగ్గుతాయి.
  • నేత్ర సంబంధిత సమస్యలకు ఉలవలతో చెక్ చెప్పవచ్చు.

హెచ్చరిక: ఉలవలలో ఉన్న గుణాలు రేబీస్ వ్యాధిని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని కుక్క కాటుకు గురైన వారు ఉలవలను అస్సలు తీసుకోకపోవడం ఉత్తమం.

Tags:    
Advertisement

Similar News