కాకర చేదు.... ఆరోగ్యం తియ్యన....

కాకరకాయ. రుచికి చేదే అయినా ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. చాలామంది కాకరకాయను తినడానికి ఇష్టపడరు… దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎన్నో రోగాలకు విరుగుడు కాకరకాయ… కాకరకాయల్లో తెల్ల కాకరకాయలు మరింత మంచివంటున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు కాకరకాయ అద్భుత ఔషధం.  కాకరకాయలో గ్లూకోజ్ ను అదుపు చేసే గుణం ఉంది. కాబట్టి ప్రతిరోజు కాకరకాయ తింటే షుగర్ అదుపులో ఉంటుంది. తీవ్రమైన చర్మ సమస్యలకు కాకరకాయ ఎంతో […]

Advertisement
Update: 2019-04-23 21:28 GMT

కాకరకాయ. రుచికి చేదే అయినా ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. చాలామంది కాకరకాయను తినడానికి ఇష్టపడరు… దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎన్నో రోగాలకు విరుగుడు కాకరకాయ… కాకరకాయల్లో తెల్ల కాకరకాయలు మరింత మంచివంటున్నారు.

  • ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు కాకరకాయ అద్భుత ఔషధం.
  • కాకరకాయలో గ్లూకోజ్ ను అదుపు చేసే గుణం ఉంది. కాబట్టి ప్రతిరోజు కాకరకాయ తింటే షుగర్ అదుపులో ఉంటుంది.
  • తీవ్రమైన చర్మ సమస్యలకు కాకరకాయ ఎంతో ఉపయోగపడుతుంది.
  • కాకర శరీరంలో పేగుల కదలికలను తేలిక చేసి ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
  • కాకరకాయ తింటే మలబద్దకం అనేది ఉండనే ఉండదు.
  • కాకరకాయలోని ఐరన్ ఎనీమియాను పోగోడుతుంది.
  • మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు, కొన్ని రోజులు కాకరకాయ జ్యూస్ తాగితే అవి కరిగి బయటకు వచ్చేందుకు ఎంతో సహాయపడుతుంది.
  • గుండె చుట్టూ ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కాకరకాయ కరిగిస్తుంది. అందువల్ల గుండెకు మంచి రక్తం అంది గుండె సంబంధిత వ్యాధులు రావు.
  • కాకరకాయను తరచుగా తినే వారి రక్తంలో ఉన్న షుగర్ అదుపులో ఉంటుంది. అందువల్ల ఎవరైనా గుండె జబ్బులతో బాధ పడుతూంటే అవి నివారించబడతాయి అంటున్నారు వైద్య నిపుణులు.
  • కాకరకాయలో ఉన్న చేదు వల్ల కడుపులో ఉన్న నులి పురుగులు, ఇతర క్రిములు నశించి మలం ద్వారా బయటకు పోయేందుకు తోడ్పతుంది.
  • కాకరకాయలో ఉన్న ఫైబర్ వ్యర్దాలను బయటకి పంపడానికి సహాయపడుతుంది.
  • కాకరలో ఉన్న యాంటీ ఆక్సీడెంట్లు అనేక రోగాల నివారణకు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి.
  • గర్భిణీలలో బ్లీడింగ్ సమస్యలకు కాకరకాయ మంచి మందు.
  • కాకరకాయ కడుపులోని బిడ్డకు ఎంతో మేలు చేస్తుంది. అయితే గర్భిణీలు కాకరకాయను మితంగానే తీసుకోవాలని వైద్యనిపుణలు సూచిస్తున్నారు.
  • కాకర కాయ జిహ్వ చాపల్యాన్ని అదుపు చేస్తుంది. అంటే చూసిందల్లా తినాలనిపించే వారి కోరికను అదుపులో ఉంచుంతుంది. దీని వల్ల బరువు పెరిగే అవకాశాలు తగ్గుతాయి.
  • కాకరకాయలో విటమిన్ బి1, విటమిన్ బి2, విటమన్ బి3, థైయమిన్, క్యాల్సియం, బీట కేరొటిన్ ఉన్నాయి. ఇవి శరీరంలో ఉన్న అన్ని సమస్యలకు చెక్ పెడతాయి.
  • తరచూ నోటి పూతతో (మౌత్ అల్సర్స్) బాధపడేవారికి కాకరకాయే విరుగుడు.
  • దీనిలో ఉండే పొటాషియం, ప్యాంటోథెనిక యాసిడ్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్ తో పాటు చాలా పోషకాలు, న్యూట్రీయన్స్ ఉన్నాయి. ఇవన్నీ గుండె, చర్మం, బీపీ, లివర్, మూత్రపిండాలు… ఇలా శరీరంలో ఉన్న అన్ని అవయవాలను కాపాడతాయి.

ఇన్ని మంచి లక్షణాలున్న కాకరకాయను కనీసం వారానికి ఒకటి లేక రెండు సార్లు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News