ప్రపంచకప్ స్టాండ్ బైల జాబితాలో రాయుడు, రిషభ్ పంత్

అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ రాయుడు, రిషభ్ లను పక్కనపెట్టడం పై విమర్శలు ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో చోటు దక్కని అంబటి రాయుడు, రిషభ్ పంత్ లతో పాటు…ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీలను స్టాండ్ బైలుగా ఉంచినట్లు బీసీసీఐ ప్రకటించింది. మొదటి 15 మంది ఆటగాళ్లలో ఎవరైనా గాయపడి అందుబాటులో లేకపోతే…వారికి బదులుగా స్టాండ్ బై ఆటగాళ్లకు అవకాశం ఉంటుందని తెలిపారు. అంతేకాదు…నెట్ బౌలర్లుగా దీపక్ చాహర్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ […]

Advertisement
Update: 2019-04-18 05:55 GMT
  • అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ
  • రాయుడు, రిషభ్ లను పక్కనపెట్టడం పై విమర్శలు

ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో చోటు దక్కని అంబటి రాయుడు, రిషభ్ పంత్ లతో పాటు…ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీలను స్టాండ్ బైలుగా ఉంచినట్లు బీసీసీఐ ప్రకటించింది.

మొదటి 15 మంది ఆటగాళ్లలో ఎవరైనా గాయపడి అందుబాటులో లేకపోతే…వారికి బదులుగా స్టాండ్ బై ఆటగాళ్లకు అవకాశం ఉంటుందని తెలిపారు.

అంతేకాదు…నెట్ బౌలర్లుగా దీపక్ చాహర్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ లను ఎంపిక చేశారు. రిషభ్ పంత్ ను ఎంపిక చేయకపోడం పై సునీల్ గవాస్కర్, రాయుడును పక్కన పెట్టడం పై గౌతం గంభీర్ అభ్యంతరం వ్యక్తం చేయడం, ఎంపిక తీరును పలువురు సీనియర్లు తప్పుపట్టడంతో…బీసీసీఐ దిద్దుబాటు చర్యల్లో భాగంగా స్టాండ్ బై జాబితాను విడుదల చేయటం విశేషం.

Tags:    
Advertisement

Similar News