భన్వర్‌లాల్‌కు అక్రమ సంబంధాలు అంటగట్టాలని చంద్రబాబు ఆదేశం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో నాటి ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు మహిళలతో అక్రమ సంబంధాలు అంటగట్టాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారని వివరించారు. భన్వర్‌లాల్‌కు మహిళలతో అక్రమ సంబంధాలు అంటగట్టాల్సిందిగా స్వయంగా టెలికాన్ఫరెన్స్‌లోనే ఆదేశించిన నీచుడు చంద్రబాబు అని ఆమంచి వ్యాఖ్యానించారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టీడీపీకి సహకరించడం లేదన్న కోపంతోనే ఈ పని చేసేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారన్నారు. ఇది నిజం కాదంటే చంద్రబాబు తన మనవడి మీద ప్రమాణం చేసి చెప్పగలరా? […]

Advertisement
Update: 2019-04-07 01:25 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో నాటి ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు మహిళలతో అక్రమ సంబంధాలు అంటగట్టాల్సిందిగా చంద్రబాబు
ఆదేశించారని వివరించారు.

భన్వర్‌లాల్‌కు మహిళలతో అక్రమ సంబంధాలు అంటగట్టాల్సిందిగా స్వయంగా టెలికాన్ఫరెన్స్‌లోనే ఆదేశించిన నీచుడు చంద్రబాబు అని ఆమంచి వ్యాఖ్యానించారు.

నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టీడీపీకి సహకరించడం లేదన్న కోపంతోనే ఈ పని చేసేందుకు చంద్రబాబు
సిద్ధపడ్డారన్నారు. ఇది నిజం కాదంటే చంద్రబాబు తన మనవడి మీద ప్రమాణం చేసి చెప్పగలరా? అని ఆమంచి ప్రశ్నించారు.

భన్వర్‌ లాల్‌ కు ఆడవారితో అక్రమ సంబంధాలు అంటగట్టాలని చంద్రబాబు చెప్పింది నిజం అన్నారు. దీనిపై నార్కో అనాలసిస్‌ పరీక్షలకైనా సిద్ధమని చంద్రబాబుకు ఆమంచి సవాల్ చేశారు.

Tags:    
Advertisement

Similar News