ప్రలోభాలకు “పచ్చ” జెండా...

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించేందుకు ప్రలోభాలకు తెర తీస్తున్నారు. లోక్ సభ నియోజక వర్గాలలో గెలుపు మాట అటుంచితే శాసనసభ నియోజక వర్గాల్లో విజయం సాధించి అధికారంలోకి రావడమే పరమావధిగా పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలలో అన్ని స్థాయిల్లోనూ ఓటర్లను ప్రభావితం చేయడమే పరమావధిగా పని చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఓటర్లను ప్రభావితం చేసేందుకు వారిని […]

Advertisement
Update: 2019-04-06 05:54 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించేందుకు ప్రలోభాలకు తెర తీస్తున్నారు. లోక్ సభ నియోజక వర్గాలలో గెలుపు మాట అటుంచితే శాసనసభ నియోజక వర్గాల్లో విజయం సాధించి అధికారంలోకి రావడమే పరమావధిగా పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి.

ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలలో అన్ని స్థాయిల్లోనూ ఓటర్లను ప్రభావితం చేయడమే పరమావధిగా పని చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఓటర్లను ప్రభావితం చేసేందుకు వారిని ఎలాంటి ప్రలోభాలకైనా గురి చేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లో దాదాపు సగానికి పైగా నియోజకవర్గాల్లో పరిస్థితి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేదని సర్వేలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవడమే పరమావధిగా పావులు కదుపుతున్నారు.

ప్రచారానికి గడువు దగ్గరపడుతుండడంతో ఎక్కడికక్కడ ఓటర్లను ప్రభావితం చేసేందుకు పచ్చ సైనికులు రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గ్రామాలలో వార్డుల వారీగా, బూత్ ల వారీగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పచ్చ సైనికులు పకడ్బందీ వ్యూహాన్ని రచిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రచారానికి ఐదు రోజులే మిగిలి ఉండటంతో రానున్న రోజుల్లో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం పచ్చ పార్టీ, వారికి మద్దతు పలికే పచ్చ మీడియా వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News