బ్యాలెట్‌లో ఒకే పేరు.... 100 శాతం పోలింగ్

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు దేశాన్ని ఏలడం దాని ముఖ్య ఉద్దేశం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే విషయం వింటే అది నిజంగా ప్రజాస్వామ్యమేనా అనే అనుమానం కలుగకమానదు. ఉత్తర కొరియా అనగానే అందరికీ కిమ్ జోంగ్ ఉన్ గుర్తుకు వస్తారు. పేరుకే ఆయన దేశాధ్యక్షుడు కానీ ఒక నియంతలా ప్రవర్తిస్తారని అందరికీ తెలుసు. మా దేశంలో కూడా ప్రజాస్వామ్యమే ఉందని ప్రపంచానికి చాటి చెప్పడానికి అక్కడ కూడా ఎన్నికలు […]

Advertisement
Update: 2019-03-27 22:40 GMT

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు దేశాన్ని ఏలడం దాని ముఖ్య ఉద్దేశం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే విషయం వింటే అది నిజంగా ప్రజాస్వామ్యమేనా అనే అనుమానం కలుగకమానదు.

ఉత్తర కొరియా అనగానే అందరికీ కిమ్ జోంగ్ ఉన్ గుర్తుకు వస్తారు. పేరుకే ఆయన దేశాధ్యక్షుడు కానీ ఒక నియంతలా ప్రవర్తిస్తారని అందరికీ తెలుసు. మా దేశంలో కూడా ప్రజాస్వామ్యమే ఉందని ప్రపంచానికి చాటి చెప్పడానికి అక్కడ కూడా ఎన్నికలు నిర్వహిస్తుంటారు. అక్కడ ‘సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ’ అనే ఏకసభా విధానం ఉంది. మొత్తం 687 స్థానాలు ఉన్నాయి.

ప్రతీ స్థానం నుంచి కిమ్ చెప్పే వ్యక్తి నిలబడతాడు. బ్యాలెట్‌లో కూడా ఒకే వ్యక్తి పేరుంటుంది. ప్రజలందరూ ఆయనకే ఓటు వెయ్యాలి. ఏ కారణంతోనైనా ఓటు వేయకపోతే ఇబ్బందుల్లో పడ్డట్టే. అక్కడ ఓటు వేయకపోవడం అనేది దేశద్రోహం కిందకు వస్తుంది. వారికి అత్యంత కఠిన శిక్షలు ఉంటాయి. అందుకే ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవడంతో 100 శాతం పోలింగ్ నమోదవుతుంది.

అసలు ఒక వ్యక్తే ఉంటే ఏకగ్రీవం చేయొచ్చుకదా అని కదా మీ డౌట్.. అలా చేస్తే అతను కిమ్ ఎలా అవతాడు…. నియంత ఎలా అవుతాడు..?

Tags:    
Advertisement

Similar News