ఇంతటి నీచత్వం నీకెలా అబ్బింది పవన్‌ కల్యాణ్?

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ముసుగు తీసేశారు. ఎన్నికల్లో ఆయన ఎలాంటి ఫలితం ఆశిస్తున్నారో తేట తెల్లమైంది. జనసేన ఎలాగో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నది అందరూ చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో తాను గెలవకపోయినా పర్వాలేదు… తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చాలన్నట్టుగా పవన్‌ మాటలు ఉన్నాయి. నామినేషన్‌ దాఖలు చేసిన రోజు గాజువాకలో పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే పవన్‌ కల్యాణ్ ఎవరి పార్టనర్‌ అన్నది సుస్పష్టంగా అర్థమవుతోంది. పైగా నిత్యం కులాలను కలుపుతా, ప్రాంతాలను ఏకం చేస్తా అని నీతులు […]

Advertisement
Update: 2019-03-22 12:00 GMT

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ముసుగు తీసేశారు. ఎన్నికల్లో ఆయన ఎలాంటి ఫలితం ఆశిస్తున్నారో తేట తెల్లమైంది. జనసేన ఎలాగో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నది అందరూ చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో తాను గెలవకపోయినా పర్వాలేదు… తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చాలన్నట్టుగా పవన్‌ మాటలు ఉన్నాయి. నామినేషన్‌ దాఖలు చేసిన రోజు గాజువాకలో పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే పవన్‌ కల్యాణ్ ఎవరి పార్టనర్‌ అన్నది సుస్పష్టంగా అర్థమవుతోంది.

పైగా నిత్యం కులాలను కలుపుతా, ప్రాంతాలను ఏకం చేస్తా అని నీతులు చెప్పే పవన్‌ కల్యాణ్… గాజువాకలో రాయలసీమపై నీచమైన వ్యాఖ్యలు చేసి తన సంస్కారానికి తాను పరీక్ష పెట్టుకున్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రవాళ్లను కేసీఆర్‌ తిడితే ఇప్పటికీ తన కడుపు మండుతోంది అని కాకమ్మ కథలు చెప్పే పవన్‌ కల్యాణ్… ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగమైన రాయలసీమపై వెయ్యి పడగల పాముకంటే ఎక్కువ విషం చిమ్మారు.

ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లాతో తనకు అనుబంధం, బంధుత్వం ఉందని డైలాగులు చెప్పే పవన్‌ కల్యాణ్… ప్రాంతాల పేర్లతో పులివెందుల మూకలు, రాయలసీమ రౌడీలు అంటూ వ్యాఖ్యలు చేశారు. నేరాలు వ్యక్తులు చేస్తారు గానీ… ప్రాంతాలు చేయవన్న సంస్కారం కూడా పవన్‌ కల్యాణ్‌కు లేకపోవడం విషాదం అని రాయలసీమ వాసులు మండిపడుతున్నారు.

పులివెందుల, రాయలసీమ ముకలంతా గుంపుగా విశాఖ వస్తారని కూడా పవన్‌ కల్యాణ్ చెప్పారు. అలా రావడానికి రాయలసీమ వాళ్లకు పనిపాటా లేదనుకుంటున్నావా పవన్?. గత ఎన్నికల్లో విశాఖలో మీరు, టీడీపీ నేతలు కలిసి చేసిన పాత
ప్రయోగమేగా ఇది. పులివెందులలో పుట్టిన వారిని చూసి భయపడుతామా అని పవన్ ప్రశ్నించారు. ఎప్పుడైనా పులివెందుల వాళ్లు గానీ, రాయలసీమ వాళ్లు గాని తమను చూసి భయపడు అని చెప్పారా పవన్‌?. పరిటాల రవి గుండు కొట్టిస్తే…
అది ఆయనకు మీకు మధ్య సమస్యే అవుతుంది గానీ ప్రాంతాల మధ్య సమస్య కాదు.

రాయలసీమలోనూ నీకు వేలాది మంది వీరాభిమానులు ఉన్నారు. ఇలాంటి మాటలు వింటే వాళ్ళు బాధపడతారన్న ఇంగితజ్ఞానం కూడా లేదా నీకు?

జగన్‌ అంటే మీకు పీకల దాక కోపం ఉంటే… జనం లేని ప్రాంతం చూసుకుని ఇద్దరూ కొట్టుకోండి. అంతేగానీ … రౌడీలకు ముందు పదేపదే రాయలసీమ పదాన్ని చేర్చడం ఎందుకు?. లక్ష పుస్తకాలు చదివానని కాకమ్మ కథలు చెబుతుంటారే… రాయలసీమ గొప్పదనం గురించి ఆ లక్ష పుస్తకాల్లో ఒక్క పుస్తకంలో కూడా తెలియలేదా?. సొంత ప్రాంతంలో ఓడిస్తే మీ అన్న చిరంజీవిని గెలిపించి మీ కుటుంబ పరువు నిలిపింది రాయలసీమ అని మరిచావా పవన్‌?.

పవన్‌ మాటలు విన్న తర్వాత… ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు అంటూ వస్తే చంద్రబాబు వల్లో, జగన్‌ వల్లో, కేసీఆర్‌ వల్లో, లేకుంటే బంగాళాఖాతంలో రేగే తుపానుల వల్లో కాదు. ఒళ్లంతా విషం నింపుకుని తిరుగుతున్న పవన్‌ కల్యాణ్‌ లాంటి వారి వాల్లే అని మండిపడుతున్నారు. అయితే ఎన్నికల సమయంలోనూ ప్రాంతాలను కించపరిచేలా, విధ్వేషాలు రెచ్చగొట్టేలా ఒక పార్టీ అధ్యక్షుడు ప్రసంగాలు చేస్తుంటే… ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేదు… అదే ఇలాంటి నేతల ధైర్యానికి కారణం.

Tags:    
Advertisement

Similar News