అన్ని సీట్లు ఎలా ఇస్తారు పవన్...

బీఎస్పీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్లు సర్దుబాటు కూడా ముగిసింది. 21 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలు బీఎస్పీకి కేటాయిస్తున్నట్టు పవన్‌ కల్యాణ్ ప్రకటించారు. చిత్తూరు, తిరుపతి, బాపట్ల లోక్‌సభ స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. 2008లోనే బీఎస్పీ ఏపీ అధ్యక్షుడిగా ఉండాలని మాయావతి కోరారని… కానీ అప్పట్లో కుదరలేదని పవన్ చెప్పారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత బీఎస్పీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. ఉత్తరాధికి చెందిన మాయావతి ప్రధాని కావాలని పవన్ ఆకాంక్షించారు. అయితే ఏమాత్రం బలం లేని […]

Advertisement
Update: 2019-03-17 07:35 GMT

బీఎస్పీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్లు సర్దుబాటు కూడా ముగిసింది. 21 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలు బీఎస్పీకి కేటాయిస్తున్నట్టు పవన్‌ కల్యాణ్ ప్రకటించారు.

చిత్తూరు, తిరుపతి, బాపట్ల లోక్‌సభ స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. 2008లోనే బీఎస్పీ ఏపీ అధ్యక్షుడిగా ఉండాలని మాయావతి కోరారని… కానీ అప్పట్లో కుదరలేదని పవన్ చెప్పారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత బీఎస్పీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. ఉత్తరాధికి చెందిన మాయావతి ప్రధాని కావాలని పవన్ ఆకాంక్షించారు.

అయితే ఏమాత్రం బలం లేని బీఎస్పీకి ఏకంగా 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించడం చర్చనీయాంశమైంది. ఇలా చేయడం ద్వారా జనసేన బలహీన పార్టీ అన్న భావన ఏర్పడేందుకు అవకాశం ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News