ప్లీజ్.... నన్ను గెలిపించండి: చంద్రబాబు వేడుకోలు!

“మీ కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను. అన్ని విధాలుగా మీరు ఎదగడానికి తోడ్పడ్డాను. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ నాయకులే కాదు సాధారణ కార్యకర్తలు కూడా ఎంతో బాగుపడ్డారు. ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను. నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీదే. ఒక రెండు నెలలు నాకోసం కష్టపడండి. తిరిగి అధికారం లోకి వద్దాం” ఇవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటలు. ఓ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, నాలుగు దశాబ్దాల సీనియర్ నాయకుడిగా […]

Advertisement
Update: 2019-03-07 21:23 GMT

“మీ కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను. అన్ని విధాలుగా మీరు ఎదగడానికి తోడ్పడ్డాను. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ నాయకులే కాదు సాధారణ కార్యకర్తలు కూడా ఎంతో బాగుపడ్డారు. ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను. నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీదే. ఒక రెండు నెలలు నాకోసం కష్టపడండి. తిరిగి అధికారం లోకి వద్దాం” ఇవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటలు.

ఓ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, నాలుగు దశాబ్దాల సీనియర్ నాయకుడిగా కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి ఉత్తేజపూరితంగా మాట్లాడాల్సిన చంద్రబాబు నాయుడు “ప్లీజ్ నన్ను గెలిపించండి” అంటూ ప్రాధేయ పడే ధోరణిలో మాట్లాడడం రాజకీయ విశ్లేషకులకే కాదు…. పార్టీ సీనియర్ నాయకులు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

గడిచిన 20 రోజులుగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లోను, ఉండవల్లిలోను వివిధ జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ప్రతి రోజూ అర్ధరాత్రి దాటే వరకు జరుగుతున్న ఈ సమావేశాలలో చంద్రబాబు నాయుడు కనీసం మూడు నాలుగు గంటలు మాట్లాడుతున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

దాదాపు ప్రతి సమావేశాల్లోనూ తాను కష్టాల్లో ఉన్నానని, ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తనను ఇబ్బందులపాలు చేయడానికి వ్యూహ రచన చేస్తున్నారని చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లుగా పార్టీ వర్గాలు తెలియజేశాయి.

మూడు గంటల ప్రసంగంలో చంద్రబాబు నాయుడు ప్రధాని, తెలంగాణ ముఖ్యమంత్రి, ఏపీలో ప్రతిపక్ష నేతల ప్రస్తావన లేకుండా మాట్లాడటం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రోజురోజుకు చంద్రబాబునాయుడులో ధైర్యం సన్నగిల్లడం, తాను అధికారంలోకి రావడానికి కార్యకర్తలు కష్టించి పని చేయాలంటూ హితబోధ చేస్తున్నారని అంటున్నారు.

చంద్రబాబు నాయుడు ప్రసంగాలు, ఆయన హావభావాలు చూస్తున్న తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు లో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News