భారత్‌కు ట్రంప్ షాక్...

భారత్‌కు షాక్ ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమయ్యారు. భారత్‌కు ఉన్న ప్రాధాన్యత వాణిజ్య హోదాను రద్దు చేసేందుకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూఎస్ కాంగ్రెస్ సభ్యులకు ట్రంప్ లేఖలు రాశారు. అమెరికా వస్తువులకు భారత్‌ 100 శాతం పన్ను వేస్తోందని… అలాంటప్పుడు భారత్‌కు యూఎస్‌ ఎందుకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాకు ఎగుమతి చేసే భారత్ వస్తువులపై పన్ను మినహాయింపు ఉంది. ప్రాధాన్యత వాణిజ్య హోదా తొలగిస్తే భారీగా […]

Advertisement
Update: 2019-03-05 00:28 GMT

భారత్‌కు షాక్ ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమయ్యారు. భారత్‌కు ఉన్న ప్రాధాన్యత వాణిజ్య హోదాను రద్దు చేసేందుకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూఎస్ కాంగ్రెస్ సభ్యులకు ట్రంప్ లేఖలు రాశారు.

అమెరికా వస్తువులకు భారత్‌ 100 శాతం పన్ను వేస్తోందని… అలాంటప్పుడు భారత్‌కు యూఎస్‌ ఎందుకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం అమెరికాకు ఎగుమతి చేసే భారత్ వస్తువులపై పన్ను మినహాయింపు ఉంది. ప్రాధాన్యత వాణిజ్య హోదా తొలగిస్తే భారీగా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి భారత్‌కు ఏర్పడుతుంది.

Advertisement

Similar News