దాడిపై తొలుత స్పందించిన ఐఎస్‌పీఆర్.... అసలు ఏంటా సంస్థ..?

భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ యుద్ద విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించి దాడులు చేసిన విషయాన్ని తొలుత ధృవీకరించింది ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ అనే సంస్థ. ఇది పాకిస్తాన్ సైన్యానికి చెందిన ప్రజా సంబంధాల వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. Indian Air Force violated Line of Control. Pakistan Air Force immediately scrambled. Indian aircrafts gone back. Details to follow. — Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) February […]

Advertisement
Update: 2019-02-26 01:03 GMT

భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ యుద్ద విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించి దాడులు చేసిన విషయాన్ని తొలుత ధృవీకరించింది ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ అనే సంస్థ. ఇది పాకిస్తాన్ సైన్యానికి చెందిన ప్రజా సంబంధాల వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.

పాకిస్తాన్ సైన్యానికి మీడియా వ్యవహారాలను చూడటమే కాకుండా ప్రత్యర్థి దేశాలపై తప్పుడు కథనాలను ప్రచారం చేయడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఐఎస్ఐ కనుసన్నల్లో ఎక్కువగా ఇది పని చేస్తుంటుంది. మన దేశంలోని కశ్మీర్‌తో పాటు పలు ప్రాంతాల్లో అల్లర్లను రెచ్చగొట్టడం దీనికి బాగా అలవాటు.

ఈ సంస్థ ఎంత బలమైనది అంటే.. ఇటీవల ఈ సంస్థకు చెందిన మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ గతంలో ఏకంగా ప్రధాని ఆదేశాలను కూడా తోసిపుచ్చుతున్నాం అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. దీంతో ఈ సంస్థపై పాకిస్తాన్ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనలు చేయడంతో ఐఎస్‌పీఆర్‌ను రద్దు చేశారు. అయినా సరే అప్పుడప్పుడు పాకిస్తాన్ సైన్యంలో స్థైర్యం తీసుకొని రావడానికి ఆ సంస్థ ట్వీట్లు పెడుతుంది.

కాగా, పాకిస్తాన్ సైన్యానికి మద్దతుగా ఉండే ఈ సంస్థ ఇవాళ భారత వైమానికి దళాలు పాకిస్తాన్ గగనతలంలో ప్రవేశించాయని ధృవీకరించినా…. తమ యుద్ద విమానాలు భారత విమానాలను తరిమికొట్టాయని పేర్కొనడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News