నిత్యం 10 గంటలు నిద్రిస్తున్నారా? మీకు ఈ జబ్బులు ఖాయం!

శరీరానికి కాస్త విశ్రాంతి ఇవ్వాలంటే… నిద్రించాల్సిందే! రోజుకు 8 గంటల నిద్ర తప్పనిసరి. దీంతో శరీరం పునరుత్తేజం చెంది…కణజాలం మరమ్మత్తు చెందుతుంది. దాంతో కొత్త శక్తి వస్తుంది. అందుకే ప్రతిఒక్కరూ రోజుకు 6 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాల్సిందేనని డాక్టర్లు చెబుతుంటారు. కానీ కొందరు రోజులో ఎక్కువ సమయం నిద్రకే కేటాయిస్తుంటారు. ఇంకొందరైతే…10 నుంచి 12 గంటలపాటు నిద్రిస్తుంటారు. నిద్ర తక్కువైతే ఎలాంటి సమస్యలు వస్తాయో…..నిద్ర అతిగా ఉన్నా అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దాదాపు […]

Advertisement
Update: 2019-02-18 20:20 GMT

శరీరానికి కాస్త విశ్రాంతి ఇవ్వాలంటే… నిద్రించాల్సిందే! రోజుకు 8 గంటల నిద్ర తప్పనిసరి. దీంతో శరీరం పునరుత్తేజం చెంది…కణజాలం మరమ్మత్తు చెందుతుంది. దాంతో కొత్త శక్తి వస్తుంది. అందుకే ప్రతిఒక్కరూ రోజుకు 6 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాల్సిందేనని డాక్టర్లు చెబుతుంటారు. కానీ కొందరు రోజులో ఎక్కువ సమయం నిద్రకే కేటాయిస్తుంటారు. ఇంకొందరైతే…10 నుంచి 12 గంటలపాటు నిద్రిస్తుంటారు. నిద్ర తక్కువైతే ఎలాంటి సమస్యలు వస్తాయో…..నిద్ర అతిగా ఉన్నా అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

దాదాపు 10 గంటలు నిద్రించే వారికి మధుమేహం, అధికబరువు, తలనొప్పి, కండరాల నొప్పి, గుండె సంబంధిత జబ్బులు, వెన్నుపూస నొప్పి, తలనొప్పి…ఇలాంటి సమస్యలు అధికంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

రోజుకు 6నుంచి 8 గంటల నిద్రపోయేవారికంటే…. 10గంటల కన్నా ఎక్కువ సమయం నిద్రకు కేటాయించేవారిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. వయస్సు ను బట్టి మన శరీరానికి ఎంత సమయం నిద్ర అవసరం ఉంటుందో… అదే పాటించాలని వైద్యులు అంటున్నారు.

కనుక రోజుకు పది గంటల కంటే ఎక్కువగా ఎవరైనా నిద్రిస్తుంటే..తక్షణమే వారు తమ అలవాటును దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే పైన చెప్పిన అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లవుతుంది.

Tags:    
Advertisement

Similar News