వన్డే మ్యాచ్ ల డబుల్ సెంచరీకి రోహిత్ రెడీ

హామిల్టన్ వేదికగా రేపు రోహిత్ 200వ వన్డే 199 వన్డేల్లో 22 సెంచరీలతో 7వేల 799 పరుగుల రోహిత్ 2007లో బెల్ పాస్ట్ వేదికగా ఐర్లాండ్ పై వన్డే అరంగేట్రం టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో…మ్యాచ్ ల డబుల్ సెంచరీకి సిద్ధమయ్యాడు. న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా సిరీస్ లో భాగంగా…హామిల్టన్ స్నెడన్ పార్క్ వేదికగా.. రేపు జరిగే నాలుగో వన్డేతో…రోహిత్ 200 మ్యాచ్ ల రికార్డును పూర్తి చేయనున్నాడు. 31 సంవత్సరాల రోహిత్ […]

Advertisement
Update: 2019-01-30 05:00 GMT
  • హామిల్టన్ వేదికగా రేపు రోహిత్ 200వ వన్డే
  • 199 వన్డేల్లో 22 సెంచరీలతో 7వేల 799 పరుగుల రోహిత్
  • 2007లో బెల్ పాస్ట్ వేదికగా ఐర్లాండ్ పై వన్డే అరంగేట్రం

టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో…మ్యాచ్ ల డబుల్ సెంచరీకి సిద్ధమయ్యాడు. న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా సిరీస్ లో భాగంగా…హామిల్టన్ స్నెడన్ పార్క్ వేదికగా.. రేపు జరిగే నాలుగో వన్డేతో…రోహిత్ 200 మ్యాచ్ ల రికార్డును పూర్తి చేయనున్నాడు.

31 సంవత్సరాల రోహిత్ ..2007లో బెల్ ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్ పై తొలివన్డే మ్యాచ్ ఆడిన రోహిత్… బే ఓవల్ లో న్యూజిలాండ్ తో ముగిసిన మూడో వన్డేలో సైతం హాఫ్ సెంచరీ సాధించాడు.

ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ ల్లో…రోహిత్ మొత్తం 199 ఇన్నింగ్స్ లో 7 వేల 799 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ తన వన్డే కెరియర్ లోని 200వ మ్యాచ్ లో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు.

Tags:    
Advertisement

Similar News