క్రిమినల్‌ను పట్టుకోవడానికి వెళ్లి... ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన కానిస్టేబుల్

ఉత్తరప్రదేశ్‌లో యోగీ ప్రభుత్వం వచ్చాక ఎన్‌కౌంటర్లు పెరిగిపోవడంపై కోర్టులతో సహా ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అయినా అక్కడ ఎన్‌కౌంటర్లు మాత్రం ఆగట్లేదు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో హర్ష్ చౌదరి(26) అనే కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యూపీలోని అమ్రోహా ప్రాంతంలో శివవతార్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాగి ఉన్నట్లు ఆదివారం రాత్రి పోలీసులకు పక్కా సమాచారం అందింది. అప్పటికే 19 క్రిమినల్ కేసులు అతనిపై నమోదయి ఉన్నాయి. దీంతో […]

Advertisement
Update: 2019-01-27 23:16 GMT

ఉత్తరప్రదేశ్‌లో యోగీ ప్రభుత్వం వచ్చాక ఎన్‌కౌంటర్లు పెరిగిపోవడంపై కోర్టులతో సహా ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అయినా అక్కడ ఎన్‌కౌంటర్లు మాత్రం ఆగట్లేదు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో హర్ష్ చౌదరి(26) అనే కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

యూపీలోని అమ్రోహా ప్రాంతంలో శివవతార్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాగి ఉన్నట్లు ఆదివారం రాత్రి పోలీసులకు పక్కా సమాచారం అందింది. అప్పటికే 19 క్రిమినల్ కేసులు అతనిపై నమోదయి ఉన్నాయి. దీంతో సాయుధులైన పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని హెచ్చరించారు. వెంటనే లొంగిపోవాలని… లేకపోతే కాల్పులు జరపాల్సి వస్తుందని మైకుల ద్వారా ప్రకటించారు.

పోలీసులు లొంగిపొమ్మని చెబుతుండగానే…. శివవతార్ కాల్పులు ప్రారంభించాడు. వెంటనే పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో హర్ష్ చౌదరి తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మరణించాడు. ఈ ఘటనలోనే శివవతార్ కూడా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా అతను కూడా మరణించాడు.

ఎన్‌కౌంటర్‌లో మరణించిన హర్ష్ భార్యకు 40 లక్షలు, అతని తల్లిదండ్రులకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పింది.

Tags:    
Advertisement

Similar News