వైఎస్‌ షర్మిల పోరాటానికి విజయశాంతి మద్దతు

తనపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై వైఎస్‌ షర్మిల బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి స్వాగతించారు. షర్మిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్యప్రచారం చూసిన తర్వాత సమాజంలో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోందన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై విషంకక్కే సంస్కృతికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో అసలే మహిళలు అణగతొక్కబడుతున్నారని… ఇలాంటి […]

Advertisement
Update: 2019-01-15 20:09 GMT

తనపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై వైఎస్‌ షర్మిల బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి స్వాగతించారు.

షర్మిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్యప్రచారం చూసిన తర్వాత సమాజంలో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోందన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై విషంకక్కే సంస్కృతికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో అసలే మహిళలు అణగతొక్కబడుతున్నారని… ఇలాంటి సమయంలో సోషల్ మీడియా వేదికగా జరిగే తప్పుడు ప్రచారం మహిళలను మరింత కుంగదీస్తుందని ఆమె ఆవేదన చెందారు.

పోలీసులు, ప్రభుత్వం వెంటనే స్పందించి మహిళల పట్ల ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయశాంతి డిమాండ్ చేశారు. 40 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమ, రాజకీయ రంగంలో పనిచేసిన తనకు ఇలాంటి అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని విజయశాంతి వివరించారు.

Tags:    
Advertisement

Similar News