శబరిమల వెళ్లిన కనకదుర్గను చితకబాదిన అత్త

10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై నిషేధం ఉండేది. అయితే సుప్రీం తీర్పు తర్వాత 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్న కొందరు మహిళలు కూడా ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అలా తొలిసారి ఆలయంలోకి ప్రవేశించిన మహిళలుగా బిందు, కనకదుర్గలు రికార్డుల్లోకి ఎక్కారు. 39 ఏళ్ల కనకదుర్గ ఈ నెల మొదట్లో పోలీసుల సాయంతో బిందుతో కలిసి శబరిమల ఆలయంలోకి వెళ్లారు. ఆ తర్వాత భక్తులకు భయపడి ఆమె 13 […]

Advertisement
Update: 2019-01-15 01:52 GMT

10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై నిషేధం ఉండేది. అయితే సుప్రీం తీర్పు తర్వాత 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్న కొందరు మహిళలు కూడా ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అలా తొలిసారి ఆలయంలోకి ప్రవేశించిన మహిళలుగా బిందు, కనకదుర్గలు రికార్డుల్లోకి ఎక్కారు. 39 ఏళ్ల కనకదుర్గ ఈ నెల మొదట్లో పోలీసుల సాయంతో బిందుతో కలిసి శబరిమల ఆలయంలోకి వెళ్లారు.

ఆ తర్వాత భక్తులకు భయపడి ఆమె 13 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. నేడు ఇంటికి తిరిగి రాగా కుటుంబసభ్యులే ఆమెను చితక్కొట్టారు. శబరిమల ఆలయంలోకి ఎందుకు వెళ్లావంటూ కనకదుర్గ అత్త దాడి చేసింది. కర్ర తీసుకుని కనకదుర్గను చితకబాదింది.

దాడిలో కనకదుర్గ తలకు గాయమైంది. దాంతో ఆమె అత్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన కనకదుర్గను చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. జనవరి రెండున కనకదుర్గ, బిందులు ఆలయంలోకి ప్రవేశించారు. కనకదుర్గ ప్రభుత్వ ఉద్యోగిణి కాగా… ఆమెతో పాటు ఆలయంలోకి వెళ్లిన బిందు న్యాయఅధ్యాపకురాలిగా కేరళలో పనిచేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News