గాంధీభవన్‌లో రణరంగం... ఆఘమేఘాల మీద సర్వేపై వేటు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన కాంగ్రెస్‌ పోస్టుమార్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా గాంధీభవన్‌లో సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాలపై సమీక్ష జరుగుతున్న వేళ రగడ జరిగింది. నేతలు కొట్టుకునేంత పనిచేశారు. సమీక్ష సమావేశంలో మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ…. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కుంతియాపై తీవ్ర ఆరోపణలు చేశారు. అసభ్యకరపదజాలంతో ధూషించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వారే ఇప్పుడు సమీక్షలు నిర్వహించడం […]

Advertisement
Update: 2019-01-06 03:57 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన కాంగ్రెస్‌ పోస్టుమార్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా గాంధీభవన్‌లో సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాలపై సమీక్ష జరుగుతున్న వేళ రగడ జరిగింది. నేతలు కొట్టుకునేంత పనిచేశారు.

సమీక్ష సమావేశంలో మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ…. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కుంతియాపై తీవ్ర ఆరోపణలు చేశారు. అసభ్యకరపదజాలంతో ధూషించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వారే ఇప్పుడు సమీక్షలు నిర్వహించడం ఏమిటని సర్వే ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థతను ప్రశ్నిస్తారని గాంధీభవన్‌ వద్ద రౌడీలను కాపలాగా పెట్టుకున్నారని ఆరోపించారు. కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు సర్వే.

ఒక దశలో సర్వే సత్యనారాయణను పీసీసీ కార్యదర్శి బిల్లు కిషన్ అడ్డుకోబోయారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన సర్వే… వాటర్‌ బాటిల్‌ను కిషన్‌పైకి విసిరి నోటికి పనిచెప్పారు.ఇలా గాంధీ భవన్‌ దద్దరిల్లింది.

సమీక్ష సమావేశంతో సర్వే సత్యనారాయణ అనుచితంగా ప్రవర్తించారని కుంతియా ఢిల్లీలోని హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. హైకమాండ్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆఘమేఘాల మీద సర్వే సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News