ఒకసారి కాదు... ఆరు సార్లు... ఇది పద్ధతి కాదు

నటుడు బాలకృష్ణకు, మెగాబ్రదర్ నాగబాబుకు మధ్య వివాదం కొనసాగుతోంది. బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని నాగబాబు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. నాగబాబుపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు మరోసారి వివరణ ఇచ్చారు. ఒక వీడియోను విడుదల చేశారు. బాలకృష్ణ పేరును ఉచ్చరించకుండానే ఆయనపై ఎందుకు తాను వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో వివరించారు. సాధారణంగా తాను వివాదాల జోలికి వెళ్లేవాడిని కాదన్నారు నాగబాబు. వివాదాలతో పేరు తెచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను చేసిన […]

Advertisement
Update: 2019-01-06 02:09 GMT

నటుడు బాలకృష్ణకు, మెగాబ్రదర్ నాగబాబుకు మధ్య వివాదం కొనసాగుతోంది. బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని నాగబాబు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి.

నాగబాబుపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు మరోసారి వివరణ ఇచ్చారు. ఒక వీడియోను విడుదల చేశారు. బాలకృష్ణ పేరును ఉచ్చరించకుండానే ఆయనపై ఎందుకు తాను వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో వివరించారు.

సాధారణంగా తాను వివాదాల జోలికి వెళ్లేవాడిని కాదన్నారు నాగబాబు. వివాదాలతో పేరు తెచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఒక ఉద్దేశం ఉందన్నారు. ఆ వ్యక్తి (బాలకృష్ణ) ఇప్పటికి ఆరు సార్లు తన కుటుంబంపైనా, తన అన్నదమ్ములపైనా కామెంట్స్‌ చేశారని గుర్తు చేశారు. అంతా చేసినా తాను మాత్రం కేవలం సరదాగానే ఆ వ్యక్తిపై వ్యాఖ్యలు చేశానన్నారు. ఐదారేళ్లుగా ఆయన (బాలకృష్ణ) పలుసందర్భాల్లో పవన్‌ కల్యాణ్‌ ఎవరో తెలియదన్నారని నాగబాబు గుర్తు చేశారు.

పవన్ కల్యాణ్ అందరికీ తెలియాల్సిన అవసరం లేదని… కానీ పవన్‌ కల్యాణ్ గత ఎన్నికల్లో మీ బావ( చంద్రబాబు)కు అండగా నిలిచి మద్దతు ఇచ్చి గెలిపిస్తే అలాంటి వ్యక్తి ఎవరో తెలియదని చెప్పడం బాధేసిందన్నారు. పవన్‌ కల్యాణ్ టీడీపీకి మద్దతు ఇచ్చి ఉండకపోతే మొన్నటి ఎన్నికల్లో జగన్ గెలిచి ఉండేవారన్నారు.

పవన్ కల్యాణ్ ఎవరో తెలియదని ఆయన అన్నప్పుడు తాము బాధపడి ఉంటాం కదా…. అని ప్రశ్నించారు. అదే తరహాలో తాను కూడా తిరిగి సదరు వ్యక్తి ఎవరో తెలియదంటే ఎందుకు కోపం వస్తోందని నాగబాబు ప్రశ్నించారు. మీరైతే అనొచ్చుకానీ.. మేమంటే కోపమొస్తదా? ఇది సరికాదు… అని నాగబాబు మరోసారి కౌంటర్ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News