విదేశీ గడ్డపై 2 వేల పరుగుల చతేశ్వర్ పూజారా

67 టెస్టుల్లో 17 శతకాల నయావాల్ 280 బాల్స్ లో100 పరుగులు సాధించిన పూజారా 3వ వికెట్ కు కొహ్లీతో కలసి 170 పరుగుల భాగస్వామ్యం టీమిండియా నయావాల్ చతేశ్వర్ పూజారా…2018 బాక్సింగ్ డే టెస్టులో…ఫైటింగ్ సెంచరీ సాధించాడు. తన సెంచరీల ఖాతాలో 17వ శతకాన్ని జమచేసుకొన్నాడు. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మూడోటెస్ట్ రెండోరోజు ఆటలో పూజారా సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 280 బాల్స్ ఎదుర్కొని వంద పరుగుల స్కోరు అందుకొన్నాడు. పూజారా అత్యంత […]

Advertisement
Update: 2018-12-28 05:48 GMT
  • 67 టెస్టుల్లో 17 శతకాల నయావాల్
  • 280 బాల్స్ లో100 పరుగులు సాధించిన పూజారా
  • 3వ వికెట్ కు కొహ్లీతో కలసి 170 పరుగుల భాగస్వామ్యం

టీమిండియా నయావాల్ చతేశ్వర్ పూజారా…2018 బాక్సింగ్ డే టెస్టులో…ఫైటింగ్ సెంచరీ సాధించాడు. తన సెంచరీల ఖాతాలో 17వ శతకాన్ని జమచేసుకొన్నాడు. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మూడోటెస్ట్ రెండోరోజు ఆటలో పూజారా సెంచరీ పూర్తి చేశాడు.

మొత్తం 280 బాల్స్ ఎదుర్కొని వంద పరుగుల స్కోరు అందుకొన్నాడు. పూజారా అత్యంత నిధానంగా సాధించిన సెంచరీలలో ఇదొకటి కావడం విశేషం.

పూజారా మొత్తం 319 బాల్స్ ఎదుర్కొని 10 బౌండ్రీలతో 106 పరుగులు సాధించి అవుటయ్యాడు. ప్రస్తుత సిరీస్ లో పూజారాకు ఇది రెండో సెంచరీ.

కెప్టెన్ విరాట్ కొహ్లీతో కలసి మూడో వికెట్ కు 170 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన పూజారా…విదేశీ టూర్లలో 2వేల పరుగుల రికార్డును సైతం పూర్తి చేయగలిగాడు.

మొత్తం 31 టెస్టుల్లో పూజారా ఈ ఘనత సాధించాడు. ప్రస్తుత మెల్బోర్న్ టెస్ట్ వరకూ 67 మ్యాచ్ లు ఆడిన పూజారా 17 శతకాలు, 20 అర్థశతకాలతో 5వేలకు పైగా పరుగులు సాధించాడు.

ఈ 17 శతకాలలో…విదేశీ గడ్డపై సాధించిన 7 సెంచరీలతో పాటు…స్వదేశీ సిరీస్ ల్లో సాధించిన 10 శతకాలు సైతం ఉన్నాయి. విదేశీ గడ్డపై 2వేల పరుగులు సాధించిన 16వ భారత క్రికెటర్ గా పూజారా రికార్డుల్లో చేరాడు.

Tags:    
Advertisement

Similar News