కోహ్లీ.... మరో మొనగాడి రికార్డు

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. విదేశీగడ్డపై ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ క్రికెటర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఆసీస్‌తో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు విదేశీగడ్డపై ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో ఎక్కువ పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా ద్రావిడ్ పేరున రికార్డు ఉంది. 2002లో ద్రావిడ్‌ విదేశీ గడ్డపై 1137 పరుగులు చేశారు. పదహారేళ్ల తర్వాత ఆ రికార్డును […]

Advertisement
Update: 2018-12-27 05:09 GMT

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. విదేశీగడ్డపై ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ క్రికెటర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఆసీస్‌తో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఇప్పటి వరకు విదేశీగడ్డపై ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో ఎక్కువ పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా ద్రావిడ్ పేరున రికార్డు ఉంది. 2002లో ద్రావిడ్‌ విదేశీ గడ్డపై 1137 పరుగులు చేశారు.

పదహారేళ్ల తర్వాత ఆ రికార్డును తిరగరాస్తూ కోహ్లి 1138 పరుగులు చేశాడు. ద్రావిడ్ కంటే ముందు అమర్‌నాథ్‌ పేరు మీద 1983లో అత్యధిక పరుగులు విదేశీ గడ్డపై చేసిన టీంఇండియా ఆటగాడిగా రికార్డు ఉండేది. అమర్‌నాథ్‌ ఆ ఏడాది 1065 పరుగులు చేశాడు.

అమర్‌నాథ్‌ రికార్డును ద్రావిడ్ బ్రేక్ చేయగా… ఇప్పుడు కోహ్లి ఆ రికార్డును సొంత చేసుకున్నాడు. మెల్‌బోర్న్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీ ఈ ఘనత సాధించినప్పటికీ… సెంచరీని మాత్రం మిస్‌ అయ్యాడు.

Tags:    
Advertisement

Similar News