20 కోట్లు, 30కోట్లు అంటూ రోజూ ఇంటి వద్దకు వచ్చేవాడు....

శ్రీకాకుళం జిల్లా రాజాం వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశంసలు జల్లు కురిపించారు. రాజాంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగం ఆఖరిలో కంబాల జోగుల గురించి జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కంబాల జోగులు ఇల్లు, ఏపీ మంత్రి కళా వెంకట్రావ్ ఇల్లు రెండూ పక్కనపక్కనే 150 గజాల దూరంలో ఉంటాయని జగన్‌ వివరించారు. దాంతో కళా వెంకట్రావ్ రోజూ జోగుల ఇంటికి వచ్చి 20 కోట్లు ఇస్తా… 30 కోట్లు ఇస్తా టీడీపీలోకి […]

Advertisement
Update: 2018-12-03 08:29 GMT

శ్రీకాకుళం జిల్లా రాజాం వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశంసలు జల్లు కురిపించారు. రాజాంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగం ఆఖరిలో కంబాల జోగుల గురించి జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

కంబాల జోగులు ఇల్లు, ఏపీ మంత్రి కళా వెంకట్రావ్ ఇల్లు రెండూ పక్కనపక్కనే 150 గజాల దూరంలో ఉంటాయని జగన్‌ వివరించారు. దాంతో కళా వెంకట్రావ్ రోజూ జోగుల ఇంటికి వచ్చి 20 కోట్లు ఇస్తా… 30 కోట్లు ఇస్తా టీడీపీలోకి వచ్చేయ్ అని ఒత్తిడి చేసేవారన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో విలువలు లేని రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలంటే కళా వెంకట్రావ్‌ ఇంటికి వెళ్లాలన్నారు జగన్. కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టినా సరే… ఇలాంటి రాజకీయాల్లోనూ కంబాల జోగులు గంజాయి వనంలో ఒక తులసి మొక్కలా నిలబడ్డారన్నారు. అలాంటి జోగులుకు తన హృదయంలో ఎప్పుడూ స్థానం ఉంటుందన్నారు. ప్రజలు కూడా కంబాల జోగులను ఆశీర్వదించాలని జగన్‌ కోరారు.

Tags:    
Advertisement

Similar News