అవమానాన్ని దిగమింగుకుని వెళ్లిన గవర్నర్‌

ఎన్నికల నేపథ్యంలో మైనార్టీ, గిరిజన వ్యక్తులకు కేబినెట్‌లో స్థానం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. వారి ప్రమాణస్వీకారం సందర్భంగా వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. గవర్నర్ నరసింహన్‌ను అవమానించేలా చంద్రబాబు వ్యవహరించారు. తిరిగి అనుకూల మీడియా ద్వారా దాన్ని ప్రచారం చేయించుకున్నారు. సాధారణంగా కేబినెట్ విస్తరణ చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి… గవర్నర్‌ వద్దకు వెళ్లి ఆ విషయాన్ని తెలియజేస్తారు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు ఆ పనిచేయలేదు. కేవలం సీఎంవో నుంచి కేబినెట్ విస్తరణ ఉందని… కొత్త వారితో ప్రమాణస్వీకారం చేయించేందుకు […]

Advertisement
Update: 2018-11-11 21:00 GMT

ఎన్నికల నేపథ్యంలో మైనార్టీ, గిరిజన వ్యక్తులకు కేబినెట్‌లో స్థానం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. వారి ప్రమాణస్వీకారం సందర్భంగా వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. గవర్నర్ నరసింహన్‌ను అవమానించేలా చంద్రబాబు వ్యవహరించారు.

తిరిగి అనుకూల మీడియా ద్వారా దాన్ని ప్రచారం చేయించుకున్నారు. సాధారణంగా కేబినెట్ విస్తరణ చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి… గవర్నర్‌ వద్దకు వెళ్లి ఆ విషయాన్ని తెలియజేస్తారు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు ఆ పనిచేయలేదు.

కేవలం సీఎంవో నుంచి కేబినెట్ విస్తరణ ఉందని… కొత్త వారితో ప్రమాణస్వీకారం చేయించేందుకు రావాలంటూ లేఖ ద్వారా సమాచారం అందజేశారు. అయినప్పటికీ గవర్నర్‌ ఆదివారం విజయవాడ వచ్చారు.

గతంలో గవర్నర్‌ విజయవాడ వచ్చినప్పుడు చంద్రబాబే స్వయంగా వెళ్లి ఆయన్ను కలిసి కార్యక్రమాలకు ఆహ్వానం పలికేవారు. ఈసారి మాత్రం గవర్నర్‌ బస చేసిన హోటల్ వద్దకు తాను వెళ్లకుండా మంత్రి పుల్లారావును పంపించారు. పుల్లారావు వెళ్లి గవర్నర్‌ను ప్రమాణస్వీకార కార్యక్రమానికి తీసుకొచ్చారు.

ఇలా చేసిన చంద్రబాబు… తన అనుకూల మీడియా ద్వారా గవర్నర్‌ను అలా ట్రీట్‌ చేయడం తన గొప్పతనం అన్నట్టు ప్రచారం చేయించారు. ఇటీవల జగన్‌పై హత్యాయత్నం జరిగిన సమయంలో గవర్నర్‌ నేరుగా డీజీపీకి ఫోన్ చేశారని… అలా చేయడంపై ఆగ్రహంగా ఉన్న చంద్రబాబు… తన నిరసనను గవర్నర్‌కు ఈ తరహాలో తెలియజేశారని మీడియా చానళ్లు ప్రచారం చేశాయి.

గవర్నర్‌ను అవమానించడం కూడా చంద్రబాబు శక్తిసామర్థ్యాలకు నిదర్శనమన్నట్టు మీడియా ప్రచారం చేసింది. అయితే గతంలో తాను విజయవాడకు వచ్చినప్పుడు చంద్రబాబు వ్యవహరించిన తీరును… ఇప్పుడు తన పట్ల వ్యవహరించిన తీరును గవర్నర్ బేరీజు వేసుకున్నారు. తనను కావాలనే అవమానించేందుకే చంద్రబాబు తనను కలవడం గానీ, విజయవాడలో స్వాగతం పలకడం గానీ చేయలేదని గవర్నర్ ఒక నిర్ధారణకు వచ్చారు.

Advertisement

Similar News