మరణానంతర జీవితం

మరణానంతర జీవితం (Afterlife) ఒక శిష్యుడు "గురువు గారూ! మరణం తరువాత జీవితం వుందా?" అని అడిగాడు. గురువు "ఎందులా అడిగావు?" అన్నాడు. శిష్యుడు "ప్రేమ లేకుండా, నవ్వు లేకుండా, పాటలు పాడకుండా, కలలు కనకుండా వుండడం దారుణం అనిపించి అలా అడిగాను" అన్నాడు. గురువు గారు నవ్వి "చాలా మంది మనుష్యులు అవన్నీ మరణానికి ముందు కూడా చేయరు.

Advertisement
Update: 2022-08-05 05:30 GMT

మరణానంతర జీవితం

ఒక శిష్యుడు "గురువు గారూ! మరణం తరువాత జీవితం వుందా?" అని అడిగాడు. గురువు "ఎందులా అడిగావు?" అన్నాడు. శిష్యుడు "ప్రేమ లేకుండా, నవ్వు లేకుండా, పాటలు పాడకుండా, కలలు కనకుండా వుండడం దారుణం అనిపించి అలా అడిగాను" అన్నాడు. గురువు గారు నవ్వి "చాలా మంది మనుష్యులు అవన్నీ మరణానికి ముందు కూడా చేయరు. అవి చేసినా పైపైన చేస్తారు. అసలైన ప్రశ్న అది కాదు. అసలైన ప్రశ్న "మరణానికి ముందు జీవితం వుందా? అన్నది" అన్నాడు.

నదిలో నీరు

ఉదయాన్నే ఉపాహారం పూర్తయ్యాక గురువు శిష్యులందరినీ ఒక దగ్గర చేర్చి ఇలా అన్నాడు. "నేను చేస్తున్నదంతా నదీతీరంలో కూర్చుని నదిలోని నీటిని అమ్ముతున్నాను. తెలివిలేని మీరందరూ వచ్చి క్యూకట్టి నీళ్ళు కొంటున్నారు. కాస్త ఆలోచించవచ్చు కదా! మీ అంతట మీరు నదిలోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవచ్చు కదా!" అన్నాడు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News